Begin typing your search above and press return to search.

వీడియో: ఈ సింప్లిసిటీ ద‌ళ‌ప‌తికే చెల్లింది సుమీ!

By:  Tupaki Desk   |   23 Jan 2023 4:00 PM GMT
వీడియో: ఈ సింప్లిసిటీ ద‌ళ‌ప‌తికే చెల్లింది సుమీ!
X
దళపతి విజయ్‌ ప్రధాన పాత్రలో వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన ద్విభాషా చిత్రం వారసుడు(వారిసు) ఇటీవ‌ల ఇరు తెలుగు రాష్ట్రాల్లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. రష్మిక మందన్నా ఈ చిత్రంలో కథానాయిక. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. థ‌మ‌న్ సంగీతం అందించారు. తమిళంలో విజ‌యం సాధించిన ఈ చిత్రం తెలుగు వెర్ష‌న్ వ‌సూళ్లు అంతంత మాత్ర‌మేన‌ని టాక్ వినిపించింది.

త‌మిళం తెలుగు వెర్ష‌న్లు క‌లుపుకుని ఫ‌ర్వాలేద‌నిపించే గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టింద‌ని టాక్ ఉంది. ఇక తెలుగు వెర్ష‌న్ ప్ర‌చారం కోసం ద‌ళ‌ప‌తి విజ‌య్ హైద‌రాబాద్ కి విచ్చేవారు. నిర్మాత దిల్‌ రాజు తన ఇంట్లోనే సక్సెస్‌ పార్టీలో సంద‌డి చేశారు.

అయితే అంత‌కుముందే హైద‌రాబాద్ శంషాబాద్ విమానాశ్ర‌యంలో ద‌ళ‌ప‌తి ఇలా సింపుల్ గా ఒక సామాన్యుడిలా న‌డుచుకుంటూ వెలుప‌లికి వ‌స్తున్న దృశ్యం అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అతడి హెయిర్ స్టైల్ మారింది.

గ‌డ్డం నెరిసి త‌న వ‌యసు బ‌య‌ట‌ప‌డుతున్నా ర‌జ‌నీకాంత్ లా స‌హ‌జంగా క‌నిపించేందుకే అత‌డు ఇష్ట‌ప‌డ్డారు. గళ్ల‌ చొక్కా బ్లాక్ జీన్స్ లో సింపుల్ గా క‌నిపించాడు. బ్లాక్ మాస్క్ ధ‌రించ‌డంతో అత‌డిని గుర్తించ‌డం కూడా క‌ష్టంగానే ఉంది. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

ఇటీవ‌ల హైద‌రాబాద్ దిల్ రాజు ఇంట్లో జ‌రిగిన‌ వార‌సుడు పార్టీలో తారాగ‌ణం స‌హా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో విజ‌య్ సందడి చేశారు. అలాగే ఈ పార్టీలో దిల్‌ రాజు మనవరాలు ఇషిత రంజితమే పాటకు స్టెప్పులేయడం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

అంతేకాదు.. ఈ క్యూట్ బేబి డ్యాన్సుల‌కు మురిసిపోయిన విజయ్ త‌న‌ను ఎత్తుకుని అభినందించాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అవుతున్నాయి. విజ‌య్ న‌టించిన వార‌సుడు ఒక టీవీ సీరియ‌ల్ లా ఉంద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా వాటికి కౌంట‌ర్లు వేసే ఆస‌క్తి ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్లో క‌నిపించ‌లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.