'ఉప్పెన' ... మక్కల్ సెల్వన్ ఎంట్రీ ఇచ్చాడు

Mon Aug 19 2019 13:23:13 GMT+0530 (India Standard Time)

Vijay Sethupathi Joins Uppena Movie Shooting

మెగా ఫ్యామిలీ నుండి సాయి తేజ తమ్ముడు వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే కాకినాడలో మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకుంది. ఈరోజు నుండి హైదరాబాద్ లో రెండో షెడ్యుల్ల్ ప్రారంభించారు. ఈరోజూ ఉదయమే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి షూట్ లో జాయిన్ అయ్యాడు.ఈ షెడ్యూల్ లో విజయ్ సేతుపతి కాంబినేషన్ సీన్స్ షూట్ చేయనున్నారు. దీని కోసం సారథీ స్టూడియోస్ లో ప్రత్యేకంగా హౌజ్ సెట్ వేశారు. ఈ హౌజ్ లోనే ప్రస్తుతం షూట్ జరుగుతుంది. ఈ షెడ్యుల్ లో ఎక్కువగా విజయ్ కాంబినేషన్ లో ఉండే సీన్స్ తీస్తారని సమాచారం. అందుకే తమిళ్ లో బిజీ గా ఉన్నప్పటికీ ఈ షెడ్యుల్ కోసం బల్క్ డేట్స్ కేటాయించడట విజయ్ సేతుపతి.

'సైరా'లో ఉయ్యాల వాడ కి నమ్మిన బంటుగా ఓబయ్య పాత్రలో కనిపించనున్న విజయ్ సేతుపతి 'ఉప్పెన' లో హీరోయిన్ ని తండ్రి పాత్రలో విలన్ గా నటిస్తున్నాడు. ఇటీవలే సైరాలో మెగా స్టార్ తో కలిసి నటించిన విజయ్ ఇప్పుడు చిరు మేనల్లుడు వైష్ణవ్ తో నటిస్తుండటం విశేషం. మరి ఈ రెండు మెగా ప్రాజెక్ట్స్ విజయ్ కి తెలుగులో నటుడిగా ఎలాంటి ఇమేజ్ తెచ్చిపెడతాయో చూడాలి.