Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: `ధూమ్` డైరెక్ట‌ర్ నెక్ట్స్ ఏంటి?

By:  Tupaki Desk   |   22 Nov 2020 12:30 AM GMT
ట్రెండీ టాక్‌: `ధూమ్` డైరెక్ట‌ర్ నెక్ట్స్ ఏంటి?
X
ధూమ్- ధూమ్ 3- థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ వంటి పెద్ద బడ్జెట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య ఇటీవ‌ల చాలా గ్యాప్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ధూమ్ సిరీస్ ఎంత బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిందో థ‌గ్స ఆఫ్ హిందూస్తాన్ అంత పెద్ద డిజాస్ట‌ర్ అవ్వ‌డం అత‌డిని నిరాశ‌ప‌రిచింది. అమితాబ్- అమీర్ అంత‌టి పెద్ద స్టార్లు న‌టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అనూహ్య ప‌రాభ‌వాన్ని మిగ‌ల్చ‌డాన్ని ఆయ‌న త‌ట్టుకోలేక‌పోయార‌నే చెప్పాలి. అందుకే రెండేళ్ల గ్యాప్ తీసుకోవాల్సి వ‌చ్చింది.

ప్ర‌స్తుతం అత‌డు ధూమ్ ఫ్రాంఛైజీ స్క్రిప్టు కాకుండా కొత్త‌ద‌నం నిండిన క‌థ‌ను రెడీ చేసారు. స్క్రిప్ట్ ‌కు తుది మెరుగులు దిద్దడంలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం నేపథ్యం ఓ ప్రత్యేక జోన‌ర్ కి చెందిన‌ ఎంటర్ టైనర్ అని చెబుతున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. విజ‌య్ కృష్ణ ఆచార్య‌ కొత్త చిత్రం ఈ రోజు ముంబైలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

విక్కీ కౌషల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా క‌థానాయిక‌లు ఇత‌ర ముఖ్య తారాగ‌ణం ఎవ‌రు అన్న‌ది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. త్వ‌ర‌లోనే బౌండ్ స్క్రిప్టును రెడీ చేసి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లాల్సి ఉంటుంద‌ట‌. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.