చాలా తక్కువ సమయంలో ఎక్కువ నేమ్ ఫేం సంపాదించి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అవుతున్నాడు విజయ్ దేవరకొండ. ఫ్లాపులు ఉన్నా అతడు నటించిన బ్లాక్ బస్టర్ల ముందు ఏదీ నిలబడలేదు. యువతరంలో అసాధారణ ఫాలోయింగ్ ఉన్నవాడిగా.. స్టైల్ ఐకన్ గా ఎనర్జిటిక్ హీరోగా పాపులరయ్యాడు.
స్టార్ హీరో స్టాటస్ ఎంజాయ్ చేస్తున్న వీడి ఇప్పుడు ఏం చేసినా పెద్ద న్యూస్ అవుతోంది. ఇదే పంథాలో ప్రతిదీ న్యూస్ అయ్యేందుకే వీడీ ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. తాజాగా విజయ్ దేవరకొండ తన పెంపుడు కుక్క చార్టెడ్ ఫ్లైయిట్ ఎక్కించి బాంబే తీసుకెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పలు రకాల టాక్స్ వినిపిస్తున్నప్పటికీ దేవరకొండ మాత్రం తాను అనుకున్న పని జరిగిందని హ్యాపీ ఫీల్ అవుతున్నట్లుగా సమాచారం.
ముంబైని ఏలేది ఖాన్ లు కపూర్ లు కుమార్ లు బాద్ షాలేనా? ఇప్పుడు టాలీవుడ్ నుంచి వీడి కూడా దిగుతున్నాడు. మగధీర.. బాహుబలి తర్వాత పుష్పరాజ్ ముంబైలో దిగి సత్తా చాటాడు. నెక్ట్స్ లైగర్ వస్తాడు. కాస్కో నా రాజా! అన్న తీరుగా వీడీ నుంచి డేంజర్ సిగ్నల్స్ అందుతున్నాయి. బాలీవుడ్ ఇప్పుడు వీడీ కవరేజీలో సిగ్నల్ పరిధిలోనే ఉంది మరి!
This Gentleman’s first plane ride. pic.twitter.com/fnaXeYOwZc
— Vijay Deverakonda (@TheDeverakonda) January 18 2022