Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లోకి కొత్త స్టార్ వచ్చేశాడు

By:  Tupaki Desk   |   16 Sep 2017 4:23 AM GMT
టాలీవుడ్ లోకి కొత్త స్టార్ వచ్చేశాడు
X
‘టాలీవుడ్ లోకి కొత్త స్టార్ వచ్చేశాడు’... ఎవరా స్టార్ అనుకుంటున్నారా? అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ కు బాగా కనెక్టయిన అర్జున్ రెడ్డి. ఇంతకీ స్టార్ అని ఎవరు అన్నారు అనే సందేహం వచ్చిందా. ఇంకెవరో కాదు.. తనే ఆ మాట చెప్పాడు. తనను అభిమానులే స్టార్ ను చేశారని చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఈవెంట్ లో దేవరకొండ విజయ్ ఈ మాట చెప్పాడు.

‘టాలీవుడ్ లోకి కొత్త స్టార్ వచ్చేశాడు. ఎందుకు.. మీరు మరింత అభిమానం చూపించడం వల్లనే. ఓ కొత్త ప్రయోగంలా సినిమా మొదలు పెట్టినప్పుడు ఎవరూ నమ్మలేదు. కానీ రిలీజ్ అయ్యాక సూపర్ హిట్టవుతున్నాయి. ఎందుకంటే ప్రేక్షకులు అభిమానం చూపుతుండటం వల్లనే. ఇంటర్ మీడియట్ చదువుకునే రోజుల్లో కూడా నాకు ఫ్యాషన్ అంటే పెద్దగా తెలీదు. కప్ బోర్డ్ లో ఏ డ్రస్ పైన కనిపిస్తే అదే వేసుకునే వాడిని. మా అమ్మే అది కాదు.. ఇది వేసుకోమంటూ నాకు సలహాలు ఇచ్చేది. అయితే ఒక్కసారి ఫిట్ గా ఉండి.. ఫీల్ గుడ్ కలిగించే డ్రస్ వేసుకుంటే ఫ్యాషన్ ను ఎంజాయ్ చేయగలుగుతారు.’ అంటూ తన స్పీచ్ లో ఫ్యాషన్ కు కొత్త నిర్వచనం ఇచ్చాడు దేవరకొండ విజయ్.

అర్జున్ రెడ్డి సినిమా తో దేవరకొండ విజయ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓవర్ నైట్ క్రేజ్ వచ్చింది. యువతలో మంచి గుర్తింపు లభించింది. దీంతో సినిమాలతో పాటు బ్రాండ్ అంబాసిడర్ ఆఫర్లు సైతం వస్తున్నాయి. కొత్తగా పెడుతున్న ఓ షాపింగ్ మాల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా అతడిని సెలక్ట్ చేసుకున్నారు.