వరుస ఫ్లాప్ లే 'హీరో'యిజానికి చెక్ పెట్టాయా?

Thu Feb 20 2020 12:00:29 GMT+0530 (IST)

Vijay Devarakonda Hero Movie Shelved

ఒక్క హిట్టు పాజిటివిటీని నింపుతుంది. ఒక్క ఫ్లాప్ మొత్తం కొలాప్స్ చేసేస్తుంది. హిట్టు వల్ల కలిగే లాభం కంటే ఫ్లాపు వల్ల కలిగే నష్టమే పదింతలు ఎక్కువ. సెంటిమెంటు పరిశ్రమలో ఫ్లాపు ప్రభావం చాలా బలంగా పని చేస్తుందనడానికి.. ఊహించని నెగెటివిటీ రాజ్యమేలుతుందనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి.వరుస ఫ్లాపులు ఇప్పుడు అతడి `హీరో`యిజానికే ముప్పు తెచ్చాయన్న రూమర్ వైరల్ అవుతోంది. అప్పటికే 10కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లిందన్న ప్రచారం సాగుతోంది. మొదలు పెట్టిన సినిమాని మధ్యలో ఆపేశారట. ఇదంతా.. దేవరకొండ `హీరో` గురించే. విజయ్ దేవరకొండ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ హీరో అనే ప్రాజెక్టును అప్పట్లో ప్రారంభించింది. బైక్ రేసింగ్ నేపథ్యం లో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్న ఈ సినిమాకోసం దేవరకొండ చాలా సాహసాలే చేశాడు. పది కోట్ల వరకూ ఖర్చు చేసి కొన్ని సీన్లు కూడా తీసేశారు. కానీ ఇంతలోనే అదే మైత్రి సంస్థ నుంచి వచ్చిన `డియర్ కామ్రేడ్` ఫ్లాపైంది. అనంతరం హీరో ప్రాజెక్టును ఆపేశారని ప్రచారమైంది. కానీ మైత్రి సంస్థ దానికి ఖండిస్తూ ఆ చిత్రాన్ని పూర్తి చేస్తామని అంది. కానీ ఇప్పుడు అది సాధ్యపడడం లేదుట.

విజయ్ కి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులొచ్చాయి. తాజాగా `వరల్డ్ ఫేమస్ లవర్` రూపంలో మరో డిజాస్టర్ ఎదురైంది. వరుస ఫ్లాపులు ఏ హీరోకి అయినా ఇబ్బందే. ఇప్పుడు ఆ సన్నివేశమే విజయ్ మార్కెట్ ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అందుకే ఇప్పుడు హీరో సినిమాని క్యాన్సిల్ చేశారని తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో ఉన్న విజయ్ ని ఆదుకునేది ఎవరు? అన్న చర్చా సాగుతోంది. ఈసారి గట్టెక్కించేది పూరీయేనా? అన్న సందిగ్ధత కూడా ఇప్పుడు వ్యక్తమవుతోంది. విజయ్ -పూరి కాంబినేషన్ మూవీపైనే ఆశలన్నీ. ఈ కాంబినేషన్ లో ఫైటర్ ఇప్పటికే చిత్రీకరణ లో ఉన్న సంగతి తెలిసిందే.

ఇక `హీరో` కోసం పది కోట్ల వరకూ ఖర్చు చేశారు కదా? ఆ నష్టం మైత్రి భరించాల్సిందేనా? అంటే.. అలాంటిదేమీ లేదు. ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి వేరొక దర్శకుడితో సినిమాని ప్రారంభిస్తారట. అక్కడ ఆ పది కోట్ల నష్టం నుంచి విజయ్ కొంత భరిస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది. మైత్రికి ఇప్పటికే పలువురు దర్శకులు టచ్ లో ఉన్నారు. వారిలో ఎవరు VD ని లాక్ చేస్తారు? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.