రౌడి గారి ర్యాంపేజ్ ఏమైనట్లు?

Sun Jul 03 2022 22:00:01 GMT+0530 (IST)

Vijay Devarakonda And Sukumar Movie

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ టైగర్ సినిమాను ఒకవైపు విడుదలకు సిద్ధం చేస్తూనే మరొకవైపు ఖుషి సినిమాను కూడా త్వరగా పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ క్రమంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే జనగణమన అనే మరొక కొత్త ప్రాజెక్టును కూడా అనౌన్స్ చేశాడు. ఆ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు.అయితే విజయ్ దేవరకొండ లిస్టులో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో కూడా విజయ్ ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. గత ఏడాది వీరి కలయిక పై  ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2024లో ర్యాంపేజ్ అంటూ అప్పట్లో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో దర్శకుడితో దిగిన ఒక ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. దీంతో ప్రాజెక్టు ఫిక్స్ అయినట్లుగా క్లారిటీ వచ్చేసింది.

అయితే సుకుమార్ ప్లానింగ్ చూస్తూ ఉంటే విజయ్ దేవరకొండ తో ప్రాజెక్ట్ అసలు ఉంటుందా ఉండదా అనే సందేహాలు చాలానే వస్తున్నాయి. అసలైతే వీరి కలయికలో వచ్చే సినిమా కోసం పూర్తి స్క్రిప్ట్ అయితే సిద్ధం కాలేదు. కేవలం ఒక లైన్ అనుకుని దాన్ని విజయ్ దేవరకొండకు చెప్పడంతో అతను ఏ మాత్రం సందేహం లేకుండా గ్రీన్ సిగ్నల్ చేశాడు. మరొకవైపు రామ్ చరణ్ తో కూడా సుకుమార్ ఒక సినిమాను పూర్తి చేయాల్సి ఉంది.

పుష్ప సెకండ్ పార్ట్ ముగిసిన తర్వాత చరణ్ తోనే సినిమా ఉంటుంది అని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పుష్ప ప్లానింగ్ చూస్తూ ఉంటే ఆ సినిమా 2024 లో వస్తుందట. ఇక ఆ తర్వాత సుకుమార్ రాంచరణ్ తో సినిమా స్టార్ట్ చేస్తాడా లేక విజయ్ దేవరకొండను లైన్ లోకి తీసుకొస్తాడు అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఆ ప్రాజెక్టులను కూడా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్స్ లోనే రూపొందనున్నాయి. మరి ఈ విషయంలో అభిమానుల్లో కొనసాగుతున్న కన్ఫ్యూజన్ కు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.