Begin typing your search above and press return to search.

వీడియో: విష క‌న్య‌లా మారిన ఊర్వ‌శి

By:  Tupaki Desk   |   23 Jan 2021 11:12 AM GMT
వీడియో: విష క‌న్య‌లా మారిన ఊర్వ‌శి
X
ప‌ర్ఫెక్ట్ ఫిజిక్ ఉంటే సరిపోదు. దానిని ఎలివేట్ చేసే విధానం తెలియాలి. ఈ విష‌యంలో బాలీవుడ్ హాటెస్ట్ గాళ్ ఊర్వ‌శి రౌతేలా నాలుగు ఆకులు ఎక్కువే చ‌దివింది. నిరంత‌రం ఈ భామ సోష‌ల్ మీడియాల్లో వేడెక్కించే ఫోటోషూట్ల‌తో గుబులు రేపుతూ భారీగా ఫాలోవ‌ర్స్ ని సంపాదించుకుంది.

ఈ ఫోటోషూట్ల‌తోనే భారీగా ఆర్జించేస్తోంది. ప్ర‌ఖ్యాత బ్రాండ్ల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా ఊర్వ‌శికి డెయిలీ ల‌క్ష‌ల్లో ముడుతోంద‌ట‌. ఓవైపు బాలీవుడ్ లో ప‌లు సినిమాల్లో న‌టిస్తూనే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లోనూ న‌టిస్తోంది. లేటెస్టుగా వెర్సాస్ బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ లో ఊర్వ‌శి హొయ‌లు హీటెక్కించాయి.

ఆమె అందం విష‌క‌న్య‌ను త‌ల‌పిస్తోంది. గుండెల్లో సూదంటు రాయిలా గుచ్చుకుపోతోంది! అంటూ విర‌హంతో వీగిపోతున్నారు బోయ్స్. బులుగు జిలుగు మ‌త్స్య క‌న్యలా.. అలా ఫ్లైయింగ్ కిస్ లు విసిరేస్తుంటే ఆ ఎద ఎత్తులు క‌ళ్ల‌ను తిప్పుకోనివ్వ‌డం లేదు. సాగ‌రంలా ఉరికే ఆ అందానికి జ‌నం కాళిదాసులే అయిపోతున్నారు మ‌రి.

ఊర్వశీ రౌతేలా టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న వేళ ఈ ఫోటోషూట్ మంట‌లు పెట్టేస్తోంది. మాస్ ద‌ర్శ‌కుడు సంపత్ నంది అందించిన కథతో తెరకెక్కుతోన్న బ్లాక్ రోజ్ అనే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. బ్లాక్ రోజ్ ఫస్ట్ లుక్.., సాంగ్ ఇప్ప‌టికే అల‌రించాయి. కార్పోరేట్ నేరాల నేపథ్యంలో థ్రిల్ల‌ర్ మూవీ ఇద‌న్న ప్ర‌చారం సాగుతోంది.