వీడియో: స్టార్ హీరో చెల్లెలు బ్రా తొలగించి అరాచకం

Tue Jul 05 2022 08:09:14 GMT+0530 (India Standard Time)

Video: Star Hero's sister removes her bra and anarchy

పిచ్చి పీక్స్  .. అరాచకం .. మోడ్రన్ డే పోయేకాలం .. ఇలా ఎలా పిలిచినా దీనికి యాప్ట్.. సదరు టీనేజీ సెలబ్రిటీ గాళ్ చేసిన ఆ పనికి రకరకాలుగా సోషల్ మీడియాల్లో కామెంట్లు వచ్చి పడుతున్నాయి. అంతగా పిచ్చి పీక్స్ పని ఏం చేసింది ఆ స్టార్ ప్రొడ్యూసర్ కుమార్తె? అంతగా అరాచకం ఏం చేసింది ఆ స్టార్ హీరో సోదరి? అంటే.. సాంప్రదాయ వాదుల వెర్షన్ ఇలా ఉంది. ఒకప్పుడు అతివాదం మితవాదం అని అనేవారు. ఇప్పుడు సాంప్రదాయ వాదం .. అల్ట్రా మోడ్రన్ వాదంగా ఇవి మారాయి. నేటి యువతరం ట్రెండ్ ని ఫాలో చేస్తున్న తీరు పిచ్చి పీక్స్ అని డెఫినిషన్ ఇవ్వాలి. హద్దులు చెరిపేసి చెలరేగిపోవడాన్ని ఫ్యాషన్ యుగం ట్రెండ్ కి పరాకాష్ట అని నిర్వచిస్తున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో `నో బ్రా క్లబ్` అనే ట్రెండ్ మొదలైంది. ఇందులో సెలబ్రిటీల చేరికతో పీక్స్ కి చేరుకుంటోంది. తాజాగా బోనీ కపూర్ కుమార్తె.. స్టార్ హీరో అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ ఈ పిచ్చి యాక్ట్ ని కొనసాగించిందంటూ సాంప్రదాయ వాదులు తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. అన్షులా ఇంకా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అరంగేట్రం చేయకపోయినా సోషల్ మీడియాల్లో నిరంతరం అభిమానులను సంపాదించుకుంటోంది.

అన్షులా గత ఆదివారం బ్రంచ్ తర్వాత ఒక వీడియోను షేర్ చేసింది. ఈ  క్లిప్ లో కపూర్ స్టార్ కిడ్ ఎంతో ఎగ్జయిట్ అవుతూ.. తను ధరించిన బ్రా ను తొలగించి లైవ్ లీగానే విసిరి పారేసింది. ఈ వీడియోను షేర్ చేస్తూ అన్షులా ``ఆదివారం బ్రంచ్ #NoBraClub లో చేరాను. ఇలా ఇంటికి రావడం ఉత్తమమైన పార్ట్`` అని తెలిపింది. జీవితంలో తనకు స్వేచ్ఛ  సౌకర్యం దొరికిందనేది తన భావన.

ఈ విచిత్రం ఎందరో స్టార్లను కూడా ఆకర్షించింది. ఈ వీడియో ఏకంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా దృష్టిని ఆకర్షించింది. తను వెంటనే  అన్షులాతో ఏకీభవిస్తూ స్పందించింది. వ్యాఖ్యల విభాగంలో `ప్రతిరోజు` అని వ్యాఖ్యానించింది. అంతే కాదు.. తనకు కూడా ఒక డేలో ఇదే అత్యుత్తమ భాగమని పీసీ వెల్లడించింది. అంటే ఇలా బ్రాలెస్ గా గడపడం తనకు ఆరోజులో ఎంతో ఉత్సాహం నింపుతుందని పీసీ పరోక్షంగా వెల్లడించింది.

అన్షులాకు ఉన్న మహిళా అభిమానులు కూడా తనకు మద్దతుగా నిలిచారు. ``అత్యుత్తమ అనుభూతి`` అని ఒక అభిమాని వ్యాఖ్యానించగా..``కనీసం మీరైనా దాని గురించి మాట్లాడారు`` అని రాశారు. అన్షులా మొహమాటం అనేది లేకుండా ఇలాంటి పోస్ట్ లు పెడుతుంటే దానిని నేటి మోడ్రన్ యుగం సలాం కొట్టి గులాం అనడం ఇదే మొదటి సారి కాదు. ఇంటర్నెట్ బాబుల హృదయాలను గెలుచుకోవడం ఇదే మొదటిసారి కాదు. కపూర్ గాళ్ నిరంతరం తన మనసులోని మాటను పబ్లిక్ గా చెప్పడానికి ఇన్ స్టాగ్రామ్ ని ఆశ్రయిస్తుంటారు. కొన్ని వారాల క్రితం అన్షులా ఫిట్ నెస్ వీడియోలో స్లీవ్ లెస్ డ్రెస్ తో కనిపించడం వల్ల తన అభద్రతాభావాన్ని వెల్లడించింది.

స్లీవ్ లెస్ గా ఏదైనా ధరించడం (ఇంట్లో కూడా) ఇప్పటికీ నాకు భయాన్ని/ అసౌకర్యాన్ని కలిగిస్తుంది! నేను ధరించాలనుకున్నది ధరించే సమయం వచ్చింది! అని కూడా వ్యాఖ్యానించింది. మొత్తానికి నో బ్రా క్లబ్ విప్లవం మరో కొత్త విషయాన్ని బయటి ప్రపంచానికి ఆవిష్కరించింది. ప్రతిరోజూ మహిళలు ఎంతో భారంగా ఇన్నర్ ని ధరించాల్సి వస్తోంది! అని ఈ లోకానికి తెలిసింది. ఇది మోడ్రన్ యుగం.. స్వేచ్ఛా కోసం వెంపర్లాడే కాలం. అందువల్ల ప్రతి అరాచకాన్ని స్వాగతించాలి అని సాంప్రదాయ వాదులు విశ్లేషిస్తున్నారు.