Begin typing your search above and press return to search.
వీడియో: మెగా ఫ్యాన్స్ పడి పడీ నవ్వుకుంటున్నారు!
By: Tupaki Desk | 14 Feb 2023 12:14 AM ISTమెగా కోడలు ఉపాసన కొణిదెల త్వరలో తమ ఇంటికి ఒక కొత్త అతిథిని ఆహ్వానించనున్న సంగతి తెలిసిందే. అరుదైన ఆ క్షణం ఎప్పుడొస్తుందా? అని మెగా కుటుంబం.. కామినేని కుటుంబాలు ఎంతో ఆత్రుతగా వేచి చూస్తున్నాయి. ఉపాసన-చరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్తతో వీరంతా మబ్బుల్లో తేల్తున్నారు. ఉపాసన సహజంగానే ఇన్ స్టాగ్రామ్ పేజీలో చాలా ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తుంటారు. ఆదివారం ఒక అభిమాని సృష్టించిన రివెంజ్ వీడియోతో చాలా మంది అభిమానులు ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ కి స్పెషల్ డేగా మారింది.
అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉపాసన- చరణ్- సాయి ధరమ్ తేజ్ ఒకే సోఫాలో కూర్చున్నారు. స్థలం ఇరుకుగా ఉండటంతో చెర్రీ తన భార్యను అక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్లి మరో పక్కన కూర్చోబెట్టాడు. ఆ తర్వాత చరణ్ తో పాటు కజిన్స్ బాగా నవ్వుకున్నారు. ఈ వీడియోకి జత చేస్తూ చరణ్ కి ఉపాసన శిక్ష ఏమిటన్నది ఫన్నీ ఫ్యాన్స్ వీడియోగా షేర్ చేసిన విధానం ఆకట్టుకుంది. ఉపాసన రివెంజ్ అని దీనికి వ్యాఖ్యను జోడించాడు.
ఇంతకీ ఏమిటా రివెంజ్ అంటే..! చరణ్ నేల తుడవడం.. మొక్కలకు నీరు పెట్టడం వంటి ఇంటి పనులన్నీ చేస్తున్న వీడియో అది. వర్కింగ్ ఎట్ హోమ్ వీడియోని చరణ్ నిజానికి లాక్ డౌన్ సమయంలో షేర్ చేసారు. అయితే తాజా ఎడిటెడ్ వీడియో చాలా ఫన్ ని క్రియేట్ చేసింది. ఇది ఉపాసనను చాలా ఎగ్జయిట్ చేసింది. తను దానిని ఇన్ స్టాలో షేర్ చేసింది. మొత్తానికి ఉపాసన రివెంజ్ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది. మెగాభిమానులు అయితే పడి పడీ నవ్వుకుంటున్నారు!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.