వీడియో : తమ్ముడు 'హిడింబ తో కుమ్మేశాడు

Mon May 16 2022 12:54:14 GMT+0530 (IST)

Video: First Glimpse of Hidimbha

బుల్లి తెరపై యాంకర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న ఓంకార్ అందరికి అన్నయ్యే. అందరు ఎంతో ప్రేమగా.. అభిమానంగా అన్నయ్య అని పిలుచుకునే ఓంకార్ యొక్క తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా ఇప్పటికే పలు సినిమాలు చేసిన విషయం తెల్సిందే. తాజాగా ఆయన హీరోగా మరో సినిమా తెరకెక్కింది. హిడింబ అనే టైటిల్ తో ఒక ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఒక టీవీ షో ఫైనల్ సందర్బంగా ఓంకార్ ఆధ్వర్యంలో హిడింబ సినిమా యొక్క గ్లిమ్స్ ను విడుదల చేశారు. అశ్విన్ బాబు సినిమాలో మంచి ఫిజిక్ తో మాస్ ను ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాడు. ఒక విభిన్నమైన నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్లుగా గ్లిమ్స్ ను చూస్తుంటే అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం అశ్విన్ బాబు హిడింబ గ్లిమ్స్ కు మంచి స్పందన దక్కింది.

అశ్విన్ బాబు హీరోగా నందిత శ్వేత హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమాకు అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఓంకార్ ఈ సినిమాను గంగపట్నం శ్రీధర్ తో కలిసి నిర్మిస్తున్నాడు. విభిన్నమైన కాన్సెప్ట్ లను ఎంపిక చేసుకుని అశ్విన్ బాబు మెల్ల గా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు దక్కించుకుంటున్నాడు.

రాజుగారి గది సిరీస్ లో తమ్ముడు అశ్విన్ బాబు ను నటింపజేయడం వల్ల మంచి గుర్తింపు వచ్చేలా ఓంకార్ సాయం చేశాడు. ఇప్పుడు అశ్విన్ బాబు ఆ గుర్తింపును తదుపరి సినిమాలతో స్టార్ డమ్ గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. హీరోగా అశ్విన్ బాబుకు ఈ సినిమా ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అయ్యేలా ఉందని గ్లిమ్స్ చూస్తుంటే అనిపిస్తుంది.

అశ్విన్ బాబు గత సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో ఫిజిక్ పరంగా చాలా మార్పు కనిపిస్తుంది. ఆయన ఈ సినిమా లో యాక్షన్ సన్నివేశాల్లో కుమ్మేశాడు అనిపిస్తుంది. మొత్తానికి సినిమా కాన్సెప్ట్ మరియు అశ్విన్ బాబు పాత్ర.. కథ పై ఆసక్తి కలిగే విధంగా హిడింబ గ్లిమ్స్ ఉన్నాయంటూ విశ్లేషకులు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.