వీడియో: 'జెర్సీ' నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్..!

Wed Dec 08 2021 15:00:00 GMT+0530 (IST)

Video Another Beautiful Song From Jersey

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన లేటెస్ట్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ''జెర్సీ''. తెలుగులో నాని నటించిన ‘జెర్సీ’ చిత్రానికి ఇది అధికారిక రీమేక్. మాతృకను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఈ సినిమా డిసెంబరు 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.హిందీ 'జెర్సీ' నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ - స్పెషల్ పోస్టర్స్ - 'మెహ్రమ్' అనే ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా 'మైయా మేను' అనే సెకండ్ సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ సాంగ్ లో హీరో జీవిత పోరాటాన్ని ఒడిదుడుకులను చూపించగా.. రెండో పాటలో హీరోహీరోయిన్ల మధ్య డీప్ లవ్ ని తెలియజేస్తోంది.

షాహిద్ కపూర్ - హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ల మధ్య ప్రేమను.. లోతైన అనుబంధాన్ని చూపిస్తున్న 'మైయా మేను' పాట వీక్షకులను అలరిస్తోంది. పెళ్లి గురించి తన తండ్రితో మాట్లాడమని మృణాల్ అంటుండగా.. సమోసా తిని వెళ్లి మాట్లాడతానని ఏడిపించడంతో ఈ సాంగ్ ప్రారంభమవుతుంది. ఇద్దరూ ప్రేమలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో చివరకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోడాన్ని ఇందులో చూడొచ్చు.

షాహిద్ - మృణాల్ మధ్య హార్ట్ టచింగ్ కెమిస్ట్రీని రొమాన్స్ ని ఈ పాటలో చూపించారు. సచేత్-పరంపర ఈ గీతానికి అద్భుతమైన ట్యూన్ సమకూర్చారు. సచేత్ టాండన్ పాడిన ఈ పాటకు షెల్లీ లిరిక్స్ అందించారు. 'జెర్సీ' చిత్రానికి తెలుగు వెర్సన్ కు మ్యూజిక్ కంపోజ్ చేసిన అనిరుధ్ రవిచంద్రన్.. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అనిల్ మెహతా సినిమాటోగ్రఫీ అందించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు.

కాగా 'జెర్సీ' చిత్రాన్ని అల్లు ఎంటర్టైన్మెంట్స్ - దిల్ రాజు ప్రొడక్షన్ - సితార ఎంటర్టైన్మెంట్స్ - బ్రాట్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో దిల్ రాజు - సూర్యదేవర నాగవంశీ - అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి బన్నీ వాసు సహ నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు నిర్మాతలు కలసి చేసిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాదిస్తుందో చూడాలి.