Begin typing your search above and press return to search.

వీడియో : మళ్లీ ట్రెండ్ అవుతున్న వారియర్‌ బుల్లెట్‌ బండి

By:  Tupaki Desk   |   10 Aug 2022 7:12 AM GMT
వీడియో : మళ్లీ ట్రెండ్ అవుతున్న వారియర్‌ బుల్లెట్‌ బండి
X
ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హీరోగా కృతి శెట్టి హీరోయిన్‌ గా లింగు స్వామి దర్శకత్వంలో రూపొంది వచ్చిన ది వారియర్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేక పోయింది. ఆశించిన స్థాయిలో సినిమా లేదంటూ ప్రేక్షకుల తిరస్కరణకు గురి అయిన విషయం తెల్సిందే.

కృతి శెట్టికి మొదటి ఫ్లాప్ గా ది వారియర్ సినిమా నిలిచింది. కమర్షియల్‌ గా సినిమా ఫ్లాప్ అయినా కూడా సినిమాలోని బుల్లెట్ బండి పాట సూపర్ హిట్ అయ్యింది.

బుల్లెట్‌ బండి లిరికల్‌ వీడియో వచ్చినప్పటి నుండి కూడా అన్ని ప్లాట్‌ ఫామ్స్ పై చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇన్‌ స్టా రీల్స్ మొదలుకుని యూట్యూబ్‌ లో కవర్ సాంగ్స్ వరకు ఎన్నో ఎన్నెన్నో వారియర్ బుల్లెట్‌ బండి వీడియోలు వచ్చాయి. సినిమా విడుదల సమయంలో కూడా ఆ పాట తెగ హడావుడి చేసింది.. సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆ పాట క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.

ఇప్పుడు యూట్యూబ్‌ లో మరోసారి ది వారియర్‌ సినిమాలోని బుల్లెట్‌ బండి వీడియో సాంగ్ వైరల్ అవుతోంది. అయిదు రోజుల క్రితం యూట్యూబ్‌ లో విడుదల అయిన బుల్లెట్ బండి వీడియో సాంగ్ ఇప్పటికి కూడా నెం.1 గానే ట్రెండ్‌ అవుతూ పాట మళ్లీ సూపర్ హిట్ అయ్యింది అనిపించుకుంది.

దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించిన ఈ పాటలోని స్టెప్పులు అందరికి నచ్చే విధంగా ఉన్నాయి. శేఖర్‌ మాస్టర్ కొరియోగ్రఫీకి మంచి మార్కులు పడతాయి. ఇక రామ్‌ మరియు కృతి శెట్టిలు పోటీ పడి మరీ డాన్స్ చేసినట్లుగా ఉన్నారు.

అందుకే పాట ఎంత ఎనర్జిటిక్ గా ఉందో వారి యొక్క స్టెప్పులు కూడా అంత ఎనర్జిటిక్ గా ఉన్నాయంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా నిరాశ పర్చినా కూడా ఈ పాట సాధిస్తున్న విజయం యూనిట్‌ సభ్యులకు కొంతలో కొంత అయినా ఊరట కలిగించే అవకాశం ఉంది.