కత్రిన పెళ్లి .. మాజీలకు పిలుపే లేదాయే

Sun Dec 05 2021 17:00:01 GMT+0530 (IST)

Vicky Kaushal And Katrina Kaif royal wedding

విక్కీ కౌశల్- కత్రిన కైఫ్ జంట పెళ్లికి 200 మందికి ఆహ్వానాలు అందాయి. ఇరువైపులా బంధుమిత్రులే ఇందులో ఎక్కువగా కనిపిస్తారు. అయితే ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు ఉంటారు? అన్నదానిపై ఇంకా పూర్తి క్లారిటీ లేదు. విక్కీ.. కత్రినలకు అత్యంత సన్నిహితులు మాత్రమే ఇండస్ట్రీ నుంచి వచ్చే వీలుంది.అయితే ఓ ఇద్దరు స్టార్ హీరోలకు మాత్రం అస్సలు పిలుపు అన్నదే లేదు. ఆ ఇద్దరూ ఎవరు? అంటే అందులో కండల హీరో సల్మాన్ ఖాన్ పేరుతో పాటు యువహీరో రణబీర్ కపూర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ ఇద్దరికీ ఎందుకని పిలుపు అందదు? అంటే.. కత్రిన  సల్మాన్ భాయ్ కి లాంగ్ టైమ్ గాళ్ ఫ్రెండ్. సల్మాన్ నుంచి బ్రేకప్ అయ్యాక తిరిగి అతడితో స్నేహితురాలిగా మాత్రమే కొనసాగుతూ సినిమాలు చేసేందుకు పరిమితమైంది.

అలాగే రణబీర్ కపూర్ తో కత్రిన ప్రేమాయణం గురించి తెలిసిందే. నాలుగేళ్ల పాటు ఈ జంట చెట్టాపట్టాల్ అంటూ షికార్లు చేశారు. ఒకానొక దశలో పెళ్లి వరకూ వెళ్లారు అని టాక్ వినిపించినా చివరికి రణబీర్ వేరొక నాయికతో డబుల్ గేమ్ ఆడడంతో అది కాస్తా బ్రేకప్ అయ్యింది. కత్రిన .. దీపికలతో రణబీర్ ఒకేసారి ప్రేమాయణం సాగించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఏది ఏమైనా కత్రిన తన మాజీలను మాత్రం పెళ్లికి ఆహ్వానించడం లేదన్నది నిజం. విక్కీ కౌశల్ ని మాత్రం ప్రేమలో లాక్ చేయడమే గాక పెళ్లితో ఫుల్ గా బ్లాక్ చేస్తోంది అంటూ గుసగుస వినిపిస్తోంది. రాజస్థాన మాధోపూర్ లో ఈ నెల 9న 100కోట్ల బడ్జెట్ తో అంగరంగ వైభవమైన వెడ్డింగ్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.