వెట్రిమారన్ మళ్లీ కొట్టాడు.. ఆలస్యం చేయకుండా తెలుగులో కూడా!

Sat Apr 01 2023 18:02:52 GMT+0530 (India Standard Time)

Vetrimaran strikes again With Vituthalai Movie

తమిళ దర్శకుల్లో అత్యంత విభిన్నమైన దర్శకుడు వెట్రిమారన్. ఈయన దర్శకత్వంలో గతంలో వచ్చిన వడ చెన్నై మరియు అసురన్ చిత్రాలు మంచి విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళంలో కమర్షియల్ సినిమాలు కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు తెరకెక్కించి సక్సెస్ లను సొంతం చేసుకున్న దర్శకుల్లో వెట్రిమారన్ ఒకరు.తాజాగా ఈయన తమిళ కమెడియన్ సూరి హీరోగా విజయ్ సేతుపతి కీలక పాత్రలో 'విడుతలై' అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా పార్ట్ వన్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెట్రిమారన్ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా విభిన్నంగా ఉండడంతో పాటు ప్రేక్షకులతో ఆలోచింపజేసే విధంగా ఉందంటూ రివ్యూలు వచ్చాయి.

సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో పాటు సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ గా ప్రచారం జరగడంతో మంచి కలెక్షన్స్ నమోదవుతున్నాయి. మరోవైపు స్టార్ హీరో శింబు నటించిన సినిమా ఉన్న కూడా 'విడుతలై' సినిమా ని తమిళ ప్రేక్షకులు చూసేందుకు థియేటర్ వద్ద క్యూ కడుతున్నారట.

తమిళంలో సూపర్ హిట్ టాక్ దక్కించుకున్న ఈ సినిమాను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వచ్చే వారంలోనే తెలుగులో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు హడావుడిగా జరుగుతున్నాయి.

తమిళంలో సూపర్ హిట్ అయినట్లుగానే తెలుగులో కూడా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ వ్యవస్థలో ఉన్న అణచివేతకు సంబంధించిన విషయాలతో ఈ సినిమాని రూపొందించడం జరిగింది.

పోలీస్ వ్యవస్థ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి తెలుగులో కూడా తప్పకుండా ఈ చిత్రం ఆకట్టుకునే అవకాశాలున్నాయి ఉన్నాయి అంటూ యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.