Begin typing your search above and press return to search.

సినిమా పూర్తి చేసి విడుదల చేయని ప్రముఖ దర్శకుడు

By:  Tupaki Desk   |   9 Jun 2023 6:00 PM GMT
సినిమా పూర్తి చేసి విడుదల చేయని ప్రముఖ దర్శకుడు
X
చిన్న హీరోల సినిమాలు.. కొత్త దర్శకులు సినిమాలు షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల మధ్యలో ఆగిపోవడం లేదంటే షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా విడుదలకు నోచుకోక పోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ యొక్క ఒక సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోవడం లేదు.

ఇటీవల 'విడుదల పార్ట్‌ 1' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెట్రిమారన్ కమర్షియల్‌ గా భారీ బ్లాక్ బస్టర్‌ అనిపించుకోలేక పోయాడు. కానీ సినిమా ఓటీటీ ద్వారా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మరో విభిన్న మైన సినిమా ను వెట్రిమారన్‌ రూపొందించాడు అంటూ అంతా కూడా మాట్లాడుకున్నారు.

వెట్రిమారన్ సినిమా సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ఒకటి అయిన వడ చెన్నై కి ప్రీ క్వెల్‌ గా ఒక సినిమా ను గతం లోనే రూపొందించాడట. అయితే ఆ సినిమా ను ఇప్పటి వరకు కనీసం ప్రకటించ లేదు. అసలు ఆ సినిమా వస్తుందా లేదా అనేది కూడా తెలియడం లేదు. ఓటీటీ లో అయినా విడుదల చేయవచ్చు కదా అంటూ వెట్రిమారన్ అభిమాను లు డిమాండ్‌ చేస్తున్నారు.

వెట్రిమారన్‌ రూపొందించిన వడ చెన్నై ప్రీక్వెల్‌ మూవీ లో హీరో ఎవరు అనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ధనుష్‌ హీరో గా వడ చెన్నై సినిమా రూపొందిన విషయం తెల్సిందే. ప్రీ క్వెల్‌ లో కూడా ధనుష్‌ నటించి ఉంటే కచ్చితంగా విడుదల అయ్యి ఉండేది. కానీ ఆ సినిమా లో ధనుష్ నటించలేదేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమా గురించి వెట్రిమారన్‌ మాత్రం మాట్లాడటం లేదు.