Begin typing your search above and press return to search.

సీనియర్ హీరోల్లో చిరు తర్వాత వెంకటేషేనా..?

By:  Tupaki Desk   |   1 April 2020 4:30 PM GMT
సీనియర్ హీరోల్లో చిరు తర్వాత వెంకటేషేనా..?
X
టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది, క్రేజ్ ఉంది కానీ కుర్ర హీరోలతో పోటీ పడి సినిమాలు చేసి విజయాలు సాధించడం మాత్రం సాధ్యం కావడం లేదు. చిరంజీవి, నాగార్జున, బాలయ్య వరస సినిమాలు అయితే చేస్తున్నారు కానీ విజయాలు మాత్రం అంతగా సాధించడం లేదు. ఒకప్పుడు చూపించిన ఆ జోరు మాత్రం ఇప్పుడు వాళ్లలో కనిపించడం లేదనే చెప్పవచ్చు. ఎప్పుడో ఓసారి వచ్చే విజయాలే కానీ వరస విజయాలను మరిచిపోయి చాలా కాలమే అయిపోయింది. ఇలాంటి సమయం లో కూడా మినిమమ్ గ్యారంటీ హీరోలలో వెంకటేష్ ఒకరు. వరుస హిట్స్ తో విక్టరీ ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ ఈ మధ్య యంగ్ హీరోలతో మల్టీ స్టారర్లు, అలాగే వయసుకు దగ్గ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. మహేష్ తో కలిసి ఆయన చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత రామ్ తో మసాలా చేశారు. అలాగే ఓ మై గాడ్ తెలుగు రీమేక్ గోపాల గోపాల చిత్రంతో పవన్ తో కలిసి నటించడం జరిగింది. ఇక గత ఏడాది వచ్చిన ఎఫ్ 2 సూపర్ హిట్ అందుకుంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్ 3 ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కూడా వెంకటేష్ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రం కోసం వెంకటేష్ తన రెమ్యూనరేషన్ పెంచేశాడని సమాచారం. తన రెగ్యులర్ రెమ్యూనరేషన్ కి రెట్టింపు ఆయన డిమాండ్ చేస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వెంకటేష్ ట్రాక్ రికార్డ్ సైతం ఇప్పుడు బాగుంది. ఆయన గత రెండు చిత్రాలు ఎఫ్ 2, వెంకీ మామ మంచి హిట్స్ అందుకున్నాయి. దీని తో ఆయన పారితోషికం పెంచారని వినికిడి. ఇదిలా ఉండగా విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తమిళ్ రీమేక్ 'అసురన్' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'నారప్ప' అనే టైటిల్ ఫిక్స్ చేయగా, హీరోయిన్ గా ప్రియమణి నటిస్తుందని సమాచారం. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మిస్తున్నారు.