Begin typing your search above and press return to search.

మరోసారి నితిన్ హిట్ కాంబినేషన్!

By:  Tupaki Desk   |   20 March 2023 6:00 PM GMT
మరోసారి నితిన్ హిట్ కాంబినేషన్!
X
యంగ్ అండ్ డైనమిక్ హీరో నితిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన భీష్మ సినిమా గురించి అందరికీ తెలిసిందే. అయితే 2020 ఫిబ్రవరి 21వ తేదీన వచ్చిన ఈ చిత్రంలో అనంత్ నాగ్, జిషు సనే గుప్తా, విజయ నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించగా... మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లనే సాధించింది.

రెండో సినిమాతోనే హిట్ కొట్టిన వెంకీ కుడుముల.. ఇప్పుడు మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా రష్మికా మందన్నా, నితిన్ ను తీసుకున్నట్లు సమాచారం. ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన భీష్మ హిట్టు కావడంతో.. మరోసారి ఈ ముగ్గురి కాంబోలో రాబోతున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతోందట. అంతే కాకుండా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను మార్చి 30వ తేదీన ప్రకటించబోతున్నారు.

ప్రస్తుతం రష్మికా మందన్నా పుష్ప2: ది రూల్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉంది. మరోవైపు ఆనిమల్ చిత్రంలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ఈ సినిమాల చిత్రీకరణ పూర్తయ్యాకే.. వెంకీ కుడుముల చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. మరోవైపు నితిన్ చేతిలో ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్టులు లేవు. ఆయన ఖాలీగానే ఉన్నారు. రష్మిక కాస్త ఫ్రీ అవ్వగానే ఈ చిత్రం తెరకెక్కుతుందనే టాక్ వినిపిస్తోంది.

అలాగే డైరెక్టర్ వెంకీ కుడుముల తీసిన చిత్రాల్లో రష్మికనే హీరోయిన్ గా తీసుకుంటున్నాడు. 2013లో హీరో నాగ శౌర్య, రష్మికా మందన్నా హీరోహీరోయిన్లుగా తన మొదటి సినిమాను తెరకెక్కించాడు. అయితే తన మొదటి చిత్రం ఛలో బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ఆ తర్వాత నితిన్, రష్మిక హీరోహీరోయిన్లుగా తీసిన బ‌యోఫామ్ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే రొమాంటిక్ ప్రేమకథ భీష్మ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ముచ్చటగా మూడోసారి రష్మిక హీరోయిన్ గా.. రెండోసారి నితిన్ హీరోగా వెంకీ కుడుముల తన మూడో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. మరి ఈ చిత్రం ఏ రేంజ్ లో హిట్టు కానుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.