పాఠాలు చెప్పబోతున్న విక్టరీ వెంకటేశ్

Sun Oct 18 2020 23:00:16 GMT+0530 (IST)

Venkatesh gives the green signal to Tarun Bhaskar full script

కామెడీ టైమింగ్ లో తిరుగులేని అద్భుత నటుడు విక్టరీ వెంకటేశ్. ఆయనకు కరెక్ట్ పాత్ర పడాలి గానీ చెడుగుడు ఆడేస్తుంటాడు. అలాంటి వెంకటేశ్ ను ఇటీవల వచ్చిన ‘ఎఫ్2’లో డైరెక్టర్ అనిల్ రావిపూడి బాగా వాడేసి ఫుల్ కామెడీ పంచాడు.అయితే ఇప్పుడు కరోనా కారణంగా వెంకీ చిత్రాలన్నీ ఆగిపోయాయి. దర్శకుడు తరుణ్ భాస్కర్ తో వెంకటేశ్ ఆ మధ్య ఓ ప్రాజెక్ట్ చేయాలనుకున్నాడు. కానీ అది కరోనాతో మూలనపడిపోయింది. వెంకీ తను నటిస్తున్న ‘నారప్ప’ సినిమా షూటింగ్ ను కూడా వాయిదా వేశాడు.

తాజాగా తరుణ్ భాస్కర్ ఫుల్ స్క్రిప్ట్ ను వెంకటేశ్ సురేష్ బాబులకు వినిపించాడని.. వారు ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కాకపోతే కరోనా తగ్గాక వచ్చే ఏడాది ‘నారప్ప’ సినిమా పూర్తయ్యేకే ఈ సినిమా పట్టాలు ఎక్కనున్నట్టు సమాచారం.

వెంకటేశ్ కోసం ఒక మంచి కథను తరుణ్ భాస్కర్ రెడీ చేశాడని.. ఓ కాలేజీ నేపథ్యంలో సాగే ఈ కథలో వెంకటేశ్ లెక్చరర్ గా నటించబోతున్నాడని టాక్. మంచి కామెడీ పంచే ఈ పాత్రలో వెంకటేశ్ ఫ్యాన్స్ ను అలరించడం ఖాయమంటున్నారు. మరి అదేంటనేది వెండితెరమీదే చూడాలి మరీ..