వెంకీ మామకు అంత రేట్ చెబుతున్నారా?

Sun May 19 2019 14:50:32 GMT+0530 (IST)

Venkatesh and Naga chaitanya Venkymama Movie Business

విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య కాంబోలో రూపొందుతున్న వెంకీ మామ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పవర్-జై లవకుశ ఫేమ్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని దసరా టార్గెట్ చేసుకుని పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. వెంకీ ఎఫ్2తో ఈ ఏడాదిలో ఇప్పటిదాకా అతి పెద్ద బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. చైతు సైతం తానేమి తక్కువ తినలేదనే తరహాలో మజిలీతో 40 కోట్ల చేరువలో వెళ్లి కెరీర్ బెస్ట్ అందుకున్నాడు.ఇప్పుడీ మేనమామ అల్లుళ్ళ కాంబినేషన్ అంటే క్రేజ్ రావడం సహజం. అందుకే వెంకీ మామకు మంచి బిజినెస్ డీల్స్ వస్తున్నాయని టాక్. అయితే నిర్మాత సురేష్ బాబు చెబుతున్న రేట్లు ఆశిస్తున్న మొత్తం బాగా ఎక్కువగా ఉందనే గుసగుసలు ఫిలిం నగర్ లో మొదలయ్యాయి

శాటిలైట్ కోసం పలు ఛానల్స్ సంప్రదించగా కేవలం తెలుగు వెర్షన్ కే 13 కోట్ల దాకా అడిగారని వినికిడి. ఇది చాలా భారీ మొత్తం. ఎంత హైప్ ఉన్నా ఫలితం తెలియకుండా అంత రిస్క్ చేయడానికి ఛానల్స్ కొంచెం వెనుకాడుతాయి. పైగా ఇది రెగ్యులర్ ఫ్యామిలీ కం కమర్షియల్ మూవీ తప్ప బాహుబలి సాహో సైరా లాగా విజువల్ గ్రాఫిక్స్ మీద ఆధారపడిన మూవీ కాదు.

అలాంటప్పుడు అంత మొత్తం అంటే కష్టమే. జూన్ 6న రామానాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసే టీజర్ తో అంచనాలు పెరుగుతాయని అప్పుడు చూద్దాం లెమ్మని ప్రస్తుతానికి ఈ టాక్స్ పెండింగ్ లో పెట్టారని తెలిసింది. మొత్తానికి వెంకీ మామ స్పీడ్ మాములుగా ఉండేలా కనిపించడం లేదు