ఆసక్తి రేకెత్తిస్తున్న 'నారప్ప' లీక్డ్ వీడియోస్

Sun Jan 26 2020 10:26:00 GMT+0530 (IST)

Venkatesh Narappa Movie Leaked Video Viral in Social Media

తమిళ హిట్ మూవీ అసురన్ ను తెలుగులో విక్టరీ వెంకటేష్ 'నారప్ప'గా రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సురేష్ బాబు మరియు వి క్రియేషన్స్ అధినేత కళై పులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. యంగ్ హీరో ధనుష్ చేసిన అసురన్ పాత్ర సీనియర్ హీరో అయిన వెంకటేష్ ఎలా చేయగలడు. అసలు నారప్ప పాత్రకు వెంకటేష్ ఎలా సెట్ అవుతాడు అంటూ చాలా మంది అనుకున్నారు. ఇదో వృదా ప్రయత్నంగా సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి.ఎప్పుడైతే నారప్ప ఫస్ట్ లుక్ వచ్చిందో అప్పుడే సినిమాపై జనాల్లో ఉన్న అభిప్రాయం మారిపోయింది. అసురన్ తెలుగు రీమేక్ కు వెంకటేష్ న్యాయం చేస్తాడనే నమ్మకం వ్యక్తం అయ్యింది. ఫస్ట్ లుక్ తో నమ్మకం కలుగగా ఇప్పుడు ఒక లీక్డ్ వీడియోతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం సినిమా కళ్యాణదుర్గంలోని ప్రముఖ దేవాలయంలో చిత్రీకరణ జరుపుతున్నారు. ఆ సందర్బంగా కొందరు వీడియోలు చిత్రీకరించడం జరిగింది.

ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నారప్ప లుక్ లో వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ మరియు ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే ఖచ్చితంగా నారప్పగా వెంకీ ఆకట్టుకుంటాడనే నమ్మకం మరింత ఎక్కువ అవుతుంది. వెంకీ కెరీర్ లో ఇది మరో ఛాలెంజింగ్ రోల్ గా నిలవడంతో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే సినిమా నిలుస్తుందని వెంకటేష్ అభిమానులు అప్పుడే నమ్మకం పెట్టుకున్నారు.