మామ మామూలుగా పెట్టలేదు కుంపటి!

Sun Dec 08 2019 12:57:05 GMT+0530 (IST)

Venkatesh And Naga CHaitanya On about Venky Mama Movie Promotions

మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్ - నాగచైతన్య ప్రమోషనల్ స్ట్రాటజీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దగ్గుబాటి కుటుంబం నేరుగా ప్రచార బరిలోకి వచ్చి ఒకటే మీడియా ఇంటరాక్షన్స్ తో దంచేస్తుండడం చూస్తుంటే  అసలేమైంది? అంటూ అంతా ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు. మొన్నటికి మొన్న వెంకీ-చైతూ-సురేష్ బాబు బృందాన్ని రానా ఇంటర్వ్యూ చేశాడు. నిన్నటి సాయంత్రం వెంకీమామ ప్రీరిలీజ్ వేదికపై వెంకీ-చై హుషారుగా స్టెప్పులేస్తూ ఉరకలెత్తించారు. ఒక రకంగా ఖమ్మం వేదిక ఊగిసలాడిందంటే అతిశయోక్తి కాదు. వెంకీ-చైతో కలిసి రాశీ-పాయల్ స్టెప్పులేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేశారు.ఇక ఈ వేదికపై మామ వెంకీని ఆపడం ఎవరి తరమూ కాలేదు. విక్టరీ వెంకటేష్ మునుపెన్నడూ లేనంతగా ఎగ్జయిట్ అవుతూ వేదికను ఉర్రూతలూగించారు. అభిమానులనుద్ధేశించి మాట్లాడుతూ హుషారెత్తిపోయారు. జోకులు పంచ్ లతో అన్ స్టాపబుల్ ట్రీటిచ్చారు. ఆ పది నిమిషాల పాటు మామ సందడితో ఒకటే వేదిక అల్లాడింది. ఇక ఈ వేదికపై మామా అల్లుళ్ల జోష్ చూస్తే అసలు ఈ ఫార్ములా ఎక్కడి నుంచి లేపారు? అన్న చర్చా నడిచింది.

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్.. అమీర్ ఖాన్.. కిలాడీ అక్షయ్ లాంటి వాళ్లు ఇలానే జనాల్లోకి వెళుతుంటారు. కాలేజ్ లు సహా అన్ని నగరాల్లో పర్యటిస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. పాడేందుకు.. ఆడేందుకు ఏమాత్రం సిగ్గుపడరు .. మొహమాట పడరు. స్టార్లు అన్న సంగతిని మరిచి ఎంతో ఎంటర్ టైనింగ్ వేలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. మన స్టార్లు అలా చేసింది చాలా అరుదు. అయితే అన్నిరకాలా సిగ్గుని విడిచి మామా అల్లుళ్లు ఖమ్మం ఫ్యాన్స్ కి అదిరే ట్రీటిచ్చారు. వేదిక ఆద్యంతం చప్పట్లు కేరింతలతో రెచ్చిపోయేలా చేశారంతే. మామ ఖమ్మంలో మామూలుగా కుంపటి పెట్టలేదు సుమీ!