వాళ్లకు హిందీ రాకున్న బాలీవుడ్ లో సూపర్ హిట్స్ చేశారు

Wed Sep 28 2022 08:00:02 GMT+0530 (India Standard Time)

Venkat Prabhu hindi movie news

సినిమాల్లో సక్సెస్ అయ్యేందుకు భాష ముఖ్యం కాదని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ఒక షార్ట్ ఫిల్మ్ విజేతలకి బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వెంకట్ ప్రభు ప్రస్తుతం తాను తెలుగు లో నాగ చైతన్య తో ఒక సినిమాను చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. తెలుగు రాకున్నా కూడా తెలుగు సినిమా చేస్తూ తాను చాలా విషయాలను నేర్చుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు.హిందీ సక్రమంగా రాని మురగదాస్ మరియు ప్రభుదేవాలు బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలు చేశారు. వారిలాగే ఎంతో మంది కూడా ఇతర భాషల్లో దక్కుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాలి అంటూ వర్ధమాన ఫిల్మ్ మేకర్స్ కి వెంకట్ ప్రభు సూచించారు. ఇతర భాషల్లో సినిమాను చేయగలమా.. అక్కడి వారిని మెప్పించగలమా అనే అప నమ్మకం ఉండవద్దు అన్నాడు.

నాకు తెలుగు సినిమా కి వర్క్ చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ సినిమా తో నేను చాలా విషయాలను నేర్చుకోబోతున్నాను అనుకుంటున్నాను. తప్పకుండా ఆ సినిమా తో అక్కడి వారిని కూడా మెప్పిస్తాను అనే నమ్మకం ఉంది. కనుక తెలుగు లో ముందు ముందు మరిన్ని సినిమాలు తమిళ దర్శకులు చేసే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న వెంకట్ ప్రభు తనకు అవకాశం దక్కితే తమిళ సూపర్ స్టార్స్ అయిన విజయ్ మరియు అజిత్ ల తో మల్టీ స్టారర్ సినిమాను చేసేందుకు సైతం తాను సిద్ధం అన్నట్లుగా పేర్కొన్నాడు.

మానాడు సినిమాలో శింబును ఒక నార్మల్ వ్యక్తిగా చూపించాను. కానీ ముత్తు సినిమాలో శింబుని గౌతమ్ వాసు దేవ్ మీనన్ చాలా బాగా చూపించారని అభినందించాడు. ప్రస్తుతం తమిళ మీడియా వర్గాల్లో వెంకట్ ప్రభు యొక్క వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.