వీరసింహారెడ్డి సై అనేసాడు..ఇక వీరయ్య దే ఆలస్యం!

Sat Dec 03 2022 16:01:46 GMT+0530 (India Standard Time)

Veerasimha Reddy Date fixed Waltheru Veeraya Has To Be

సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలున్నా ప్రధానమైన పోటీ మాత్రం మెగాస్టార్ చిరంజీవి-నటసింహ బాలయ్య మధ్యనే ఉంటుంద న్నది వాస్తవం. అందుకే రెండు సినిమాలు జనవరికి వస్తున్నాయని ఫిక్స్ అయ్యాయిగానీ..ఎవరూ ఇంత వరకూ అధికారికంగా వస్తున్నామని  రిలీజ్ తేదీ ప్రకటించలేదు.  ముందుగా ఒకరు అనౌన్స్  చేస్తే ఆ తర్వాత వెసులు బాటు తేదీలు చూసుకుని ప్రకటిద్దామని ఒకరి కొకు వెయిట్ చేసారు.ఇంత కాలం బాలయ్య కూడా ఇలాగే వెయిట్ చేసారు. దీంతో ఒక లాభం లేదనుకున్న  బాలయ్య  ముందే ఫిక్స్ అయ్యారు. అందుకే కొద్ది సేపటి క్రితమే  'వీరసింహారెడ్డి' రిలీజ్ తేదిని ప్రకటించేసారు. జనవరి 12 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో బాలయ్య  రంగంలోకి దిగడం పక్కా అయింది. ఇక మిగిలింది  చిరంజీవి మాత్రమే.

ఆయన కథానాయకుడిగా 'వాల్తేరు వీరయ్య' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ అని అధికారిక సమాచారం వచ్చేసినా డేట్ ఫిక్స్ చేయలేదు. ఇక వీరయ్య కూడా డేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది. వీర సింహారెడ్డి కంటే ముందుగానీ..ఆ తర్వాత గానీ వచ్చే అవకాశం ఉంది. రెండు సినిమాలు నిర్మిస్తోంది మైత్రీమూవీ  మేకర్స్ కాబట్టి అన్ని రాకలుగా వెసులు బాటు చూసుకునే ప్రకటించే అవకాశం ఉంది.

అలాగని మరి పది రోజుల వ్యవధి తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్నది  చిరంజీవి కాబట్టి సరిగ్గా పండుగలోనే రిలీజ్ చేయాలి! అన్న నిబంధన సహా అభిమానుల ఒత్తిడిని కూడా దృష్టలో పెట్టుకోవాల్సి ఉంటుంది.

ఇప్పటికే  13వ తేది రిలీజ్ ఆలోచనలో ఉన్నట్లు లీకులందుతున్నాయి.  ఇక విజయ్  'వారసుడి'పై  మాత్రం  వీరసింహారెడ్డి ఎటాక్ అయితే పక్కా అని తేలిపోయింది.

ఇక బాలయ్య-చిరంజీవి బాక్సాఫీస్ వార్ లో తలపడటం  కొత్తేం కాదు. గతంలో ఇలాంటి సన్నివేశం చాలాసార్లు చోటు చేసుకుంది. చివరిగా 2017 లో గౌతమీ పుత్రశాతకర్ణి..ఖైదీనెంబర్ 150 ఒకేసారి రిలీజ్ అయ్యాయి. రెండు ఆ ఏడాది భారీ విజయాలు సాధించాయి. మరి 2023 లో ఇద్దరు స్టార్లు ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.