Begin typing your search above and press return to search.

నాగ్ తో ఆ సినిమా, నా కెరీర్ నాశనం చేసింది..!

By:  Tupaki Desk   |   9 Jun 2023 3:00 PM GMT
నాగ్ తో ఆ సినిమా, నా కెరీర్ నాశనం చేసింది..!
X
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ ఎన్నో ఆశలతో అడుగుపెడతారు. తమ సినిమబాలు హిట్ అయ్యి సక్సెస్ రావాలని కోరుకుంటారు. కానీ ఒక్కోసారి వారికి ప్లాప్ లు పరిచయం అవుతాయి. హీరోకి ప్లాప్ పడితే, మరో డైరెక్టర్ సినిమా చేయడానికి ముందుకు రావచ్చు. కానీ, దర్శకుడికి ప్లాప్ పడితే, ఆయనతో సినిమా చేయడానికి తొందరగా ఏ హీరో ముందుకు రాడు.దీంతో వారి కెరీర్ అక్కడితో ఆగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తన విషయంలో అదే జరిగిందని ఓ డైరెక్టర్ వాపోతున్నాడు. ఆయనే దర్శకుడు వీరభద్రం చౌదరి.

ఆయన నాగార్జున భాయ్ సినిమాకి దర్శకత్వం వహించారు.2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ యాక్షన్‌ కామెడీ చిత్రంలో నాగ్ సరసన రిచా గంగోపాధ్యాయ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ప్లాప్ డైరెక్టర్ వీరభద్రానికి పెద్ద దెబ్బ పడింది.

ఈ మూవీ రిజల్ట్ తర్వాత ఆయనతో సినిమాలు చేయడానికి హీరోలు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. దీంతో, ఆయన తన కెరీర్ ని కోల్పోవాల్సి వచ్చింది. మూవీ ప్లాప్ కావడానికి తనకు సంబంధం లేని హీరో నాగ్ స్టేట్మెంట్ తో, తప్పంతా డైరెక్టర్ ఖాతాలోకే వెళ్లిపోయింది. అంతే, ఆయన కెరీక్ కి అక్కడితో పులిస్టాప్ పడింది.

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఆ మూవీ సంగతులు వివరించాడు. భాయ్ సినిమా కారణంగా తన కెరీర్ నాశనం అయ్యిందని ఆయన చెప్పడం గమనార్హం. అహనా పెళ్లంట, పూల రంగడు లాంటి కామెడీ సినిమాలతో హిట్ కొట్టిన ఆయన భాయ్ తో అట్టర్ ప్లాప్ అందుకున్నాడు. ఆ మూవీ ప్లాప్ కారణంగా తాను ఒక్కసారిగా ఎగురుతున్న విమానంలో నుంచి కింద పడినట్లుగా తన పరిస్థితి మారిందని ఆయన అన్నారు.

తాను అసలు భాయ్ మూవీని ఫుల్ కామెడీ మూవీ గా చేయాలని అనుకున్నారట. కానీ హీరో నాగార్జున కావడంతో, కథలో మార్పులు చేయాల్సి వచ్చిందట. చివరకు తాను అనుకున్నట్లుగా కాకుండాడ, మరోలా సినిమా తీయాల్సి వచ్చిందని ఆయన చెప్పాడు. తాను సరదాగా అందరూ నవ్వుకునేలాంటి సినిమా తీయాలని అనుకుంటే, అది చివరకు సీరియస్ గా మారిందని ఆయన చెప్పారు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు కూడా కామెడీ మూవీనే కోరుకుంటారని తనకు అర్థమైందన్నారు.

ఇక ఆ సినిమా తర్వాత ఆయనకు అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత చుట్టాలబ్బాయి అని ఆదితో ఓ సినిమా తీశారు. కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఒక్క సినిమా కూడా చేయలేదు. మళ్లీ ఏడేళ్ల తర్వాత దిల్ వాలా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. మరి ఈ మూవీతో ఆయన కెరీర్ మళ్లీ గాడిన పడుతుందో లేదో చూడాలి.