వీడియో: అనసూయ వీరంగం

Wed Dec 04 2019 13:00:17 GMT+0530 (IST)

Vedio: Anasuya Fire On Men

హైదరాబాద్ శివారులో  చోటు చేసుకున్న దిశ(ప్రియాంక రెడ్డి) ఘటన దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనమైందో తెలిసిందే. సెలబ్రిటీలతో పాటు కామన్ జనం ముక్తకంఠగా  ఆ బాధితురాలికి న్యాయం జరగలంటే నిందుతులకు  మరణదండన విధించాల్సిందేనని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. హైదరాబాద్ సహా అన్ని నగరాల్లో.. చివరికి రాజధాని దిల్లీ వీధుల్లోనూ నిరసనల సెగలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ప్రస్తుతం నిందితులు రిమాండ్ లో ఉన్నారు. అయితే ఈ ఘటనపై కొందరు నెటిజనులు వ్యతిరేకంగాను స్పందించారు. అసభ్య పదజాలంతో దిశను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెట్టారు. వాళ్లలో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కుర్రాడిని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని  విచారిస్తున్నారు.ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు క్రైమ్ ని ఎలా ప్రోత్సహిస్తారని నిప్పుల వర్షం కురిపించారు యాంకర్ కం నటి అనసూయ. అయినా యథేచ్చగా అలాంటి  పోస్టులు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ పోస్టింగును చూసిన అనసూయ ఆవేశంతో ఊగిపోయారు. ఆ పోస్ట్ ను చదివి అసభ్య  పదజాలంతో నెటిజనులపై ఆగ్రహం చెందారు. పైగా నెటిజనుల దుర్భాషల్ని.. కామెంట్లను వీడియో సాక్షిగా వినిపిస్తూ మరింతగా కోపం వ్యక్తం చేశారు.

ఒకానొక సమయంలో అనసూయ అసలు విషయం మరిచి ఆ పోస్టులు పెట్టిన కుర్రాళ్ల  తల్లిదండ్రుల పైనా నోరు జారడం చర్చకు వచ్చింది. దీంతో అనసూయపై చాలా మంది నెటిజనులు మండిపడుతున్నారు. పోస్టులను పెట్టిన వాళ్ల ని ఉద్దేశించి మాట్లాడాలి గాని! మధ్యలో పేరెంట్స్ ని ఎందుకు లాగుతారు! అంటూ ఆగ్రహం చెందడం కొసమెరుపు.