Begin typing your search above and press return to search.

పింక్ చీరలో కొంటెగా క‌వ్విస్తున్న బాణం బ్యూటీ

By:  Tupaki Desk   |   13 May 2021 3:30 AM GMT
పింక్ చీరలో కొంటెగా క‌వ్విస్తున్న బాణం బ్యూటీ
X
నారా రోహిత్ స‌ర‌స‌న బాణం చిత్రంలో న‌టించింది వేదిక‌. ఆ త‌ర్వాత న‌ట‌సింహా బాల‌కృష్ణ‌ స‌ర‌స‌న రూల‌ర్ లో అవ‌కాశం అందుకుంది. అయితే ఈ న‌వ‌త‌రం బ్యూటీకి ఆశించినంత పెద్ద హిట్లు ద‌క్క‌లేదు. దాంతో వ‌రుస‌ ఆఫ‌ర్లేవీ రాలేదు. మునిలో రాఘ‌వ‌ లారెన్స్ స‌ర‌స‌న ఆడిపాడింది. కానీ అది కూడా క‌లిసిరాలేదు. వేదిక‌ 2019లో ది బాడీ అనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ లో న‌టించింది. ఇందులో హిమేష్ రేష‌మ్మియా.. రిషీ క‌పూర్.. శోభిత‌ ధూళిపాల‌ త‌దిత‌రులు న‌టించారు. ల‌క్ చిక్క‌క‌పోయినా.. కాలం క‌లిసి రాక‌పోయినా.. ప్ర‌య‌త్నాలు మాత్రం విడిచిపెట్ట‌లేదు ఈ బ్యూటీ.

ఇటీవ‌ల రూట్ మార్చింది. మునుప‌టితో పోలిస్తే వేదిక‌లో హాట్ కంటెంట్ ని బ‌య‌ట‌కు తీస్తోంది. ఇన్ స్టాలో వ‌రుస‌ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. ఇప్ప‌టికే వేదిక బోల్డ్ ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో వేడెక్కించాయి. బికినీ బీచ్ ఫోటోషూట్ల‌తోనూ ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది.

తాజాగా పింక్ చీర‌లో వేదిక వ‌న్నె చిన్నెలు వ‌డ్డిస్తూ సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపించింది. అస‌లే స‌న్న‌జాజి తీగ‌లా మారిన ఈ అమ్మ‌డు అలా వీపందం ప్ర‌ద‌ర్శిస్తూ చీర ర‌వికెలో కుర్ర‌కారును కొంటెగా క‌వ్వించేస్తోంది. చూస్తుంటే టాలీవుడ్ లో మ‌రోసారి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఈ ట్యాలెంటెడ్ బ్యూటీని పిలిచి అవ‌కాశాలివ్వ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.