Begin typing your search above and press return to search.

మరో టార్గెట్ సెట్ చేసుకున్న వరుణ్ తేజ్

By:  Tupaki Desk   |   31 Jan 2023 7:00 PM GMT
మరో టార్గెట్ సెట్ చేసుకున్న వరుణ్ తేజ్
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని సినిమాతో డిజాస్టర్ కొట్టాడు. ఈ నేపధ్యంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ తో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని గట్టిగానే కష్టపడుతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని దర్శకుడు ఆవిష్కరిస్తున్నారు. ఇక ఇందులో వరుణ్ తేజ్ మొదటి సారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

పోలీస్ కాప్ స్టొరీ అంటే కచ్చితంగా పవర్ ఫుల్ కాన్సెప్ట్ తోనే ఈ మూవీ తెరకెక్కి ఉంటుందని మెగా అభిమానులు భావిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అల్లు అర్జున్, రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోలుగా మారిపోయాడు.

ఈ నేపధ్యంలో తన బ్రాండ్ ఇమేజ్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని వరుణ్ తేజ్ భావిస్తున్నాడు. అందులో భాగంగా కాస్తా హై వోల్టేజ్ కథలకి పచ్చజెండా ఊపుతున్నాడు. అలాగే డాన్స్ కి స్కోప్ లేకుండా కేవలం పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని తాను హీరోగా మార్కెట్ లోకి వెళ్లాలని అనుకుంటున్నాడు.

అందులో భాగంగానే డిఫరెంట్ కాన్సెప్ట్ లని ట్రై చేస్తున్నాడు. ఇక ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కూడా అలాంటి కథతోనే ప్రేక్షకులని మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాకి గాండీవదారి అర్జున అనే టైటిల్ ని ఇప్పటికే ఖరారు చేశారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాని వేసవి వినోదంగా ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని దర్శకుడు ప్రవీణ్ సత్తారు భావిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. గ్యాప్ తీసుకోకుండా రెగ్యులర్ షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు.

మార్చి నెల ఆఖరులో లేదంటే ఏప్రిల్ లో ప్రేక్షకులని అందించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుందని సమాచారం. మరి వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఏ రేంజ్ ని హిట్ అందుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీని తర్వాత తెలుగు, హిందీ బైలింగ్వల్ ప్రాజెక్ట్ ని వరుణ్ తేజ్ చేస్తున్నాడు. ఆ సినిమాలో ఎయిర్ ఫైటర్ గా వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఆ మూవీ కథని దర్శకుడు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.