Begin typing your search above and press return to search.

వరుణ్ లవ్.. ఎంగేజ్మెంట్ తో సర్ ప్రైజ్ ఇచ్చారుగా..

By:  Tupaki Desk   |   10 Jun 2023 9:13 AM GMT
వరుణ్ లవ్.. ఎంగేజ్మెంట్ తో సర్ ప్రైజ్ ఇచ్చారుగా..
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారు, త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నారు అంటూ చాలా కాలం నుంచి ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా అయితే వీరి నిశ్చితార్ధం జూన్ 9న జరగబోతోంది అని కూడా ముందుగా ఓ ఆంగ్ల వెబ్ సైట్ లీక్ చేసింది. అక్కడి నుంచి వీరిద్దరి పెళ్లి గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ నిశ్చితార్ధం గురించి ముందు రోజు వరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి సమాచారం బయటకి రాలేదు. జూన్ 8న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ గురించి ఇన్విటేషన్ ఒకటి అఫీషియల్ గా సోషల్ మీడియాలో విడిచిపెట్టి కన్ఫర్మ్ చేశారు. అయితే అది కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా దీనిని ప్రకటించలేదు. దీనికి కారణం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ కేవలం ఒక ప్రైవేట్ ఫంక్షన్ తరహాలో నాగబాబు ఇంట్లోనే నిర్వహించారు.

మీడియాకి కూడా ఎలాంటి ఇన్విటేషన్ లేదు. మెగా ఫ్యామిలీతో పాటు లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు మాత్రమే ఈ ఎంగేజ్ మెంట్ ఈవెంట్ కి హాజరయ్యారు. నిశ్చితార్ధం తర్వాత మరల యధావిధిగా ఎవరి సినిమా షూటింగ్ లకి వారు వెళ్లిపోనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే వరుణ్, లావణ్య ఎంగేజ్మెంట్ కి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిజైనర్ శారీతో లావణ్య త్రిపాఠి. కుర్తా టైపు వైట్ కలర్ డ్రెస్ లో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కాస్ట్యూమ్స్ లో మెరిసిపోతున్నారు. ఓ స్టిల్ లో లావణ్య త్రిపాఠి కుర్చీలో కూర్చొని ఉండగా వరుణ్ తేజ్ నిలబడి ఫోజులు ఇచ్చారు.

మరో ఫోటోలో లావణ్య వరుణ్ గుండెల మీద చేయి వేసి ఎంగేజ్మెంట్ రింగ్స్ ఎలివేట్ అయ్యే విధంగా ఉంది. ఇంకో పిక్ లో ఇద్దరు సెలబ్రేషన్స్ లో ఫుల్ గా ఆస్వాదిస్తున్నట్లు నవ్వుతూ క్లోజ్ గా కనిపిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా వారి నిశ్చితార్థం గురించి అఫీషియల్ గా తెలియజేశారు.

పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి కమిట్ అయిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేసే పనిలో ఉంది. ఆమె ప్రస్తుతం తమిళంలో అధర్వకి జోడీగా ఒక మూవీ చేస్తోంది. అలాగే తెలుగులో ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ఇక వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవదారి అర్జున మూవీచేస్తున్నాడు. అలాగే తెలుగు, హిందీ భాషలలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా ఒక మూవీ చేస్తున్నాడు.