Begin typing your search above and press return to search.

#A1 మెగా హాకీ స్టార్స్ ... ప్రిన్స్ వ‌రుణ్ (Vs) పంజా వైష్ణ‌వ్

By:  Tupaki Desk   |   5 March 2021 4:30 AM GMT
#A1 మెగా హాకీ స్టార్స్ ... ప్రిన్స్ వ‌రుణ్ (Vs)  పంజా వైష్ణ‌వ్
X
యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ ల్యాండ్ మార్క్ మూవీ(25వ చిత్రం) `A1 ఎక్స్‌ప్రెస్`. స్పోర్ట్స్ నేప‌థ్యంలో ఆద్యంతం థ్రిల్లింగ్ ఎంటర్ టైన‌ర్ ఇది. లావణ్య త్రిపాఠి క‌థానాయిక. డెన్నిస్ జీవన్ కనుకోలను ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. టిజి విశ్వ ప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ - సందీప్ కిషన్ - దయా పన్నెం సంయుక్తంగా .. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ- అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్- వెంకటాద్రి టాకీస్ బ్యానర్లలో నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే రిలీజైన ప్రీలుక్ పోస్ట‌ర్లు టీజ‌ర్ ట్రైల‌ర్ ఆక‌ట్టుకున్నాయి. సందీప్ కిషన్ చొక్కా విప్పి 6ప్యాక్ తో అద‌ర‌గొట్ట‌బోతున్నాడు.. హాకీ స్టేడియంలో కోలాహాలం తేగ‌ల స‌మ‌ర్ధుడైన ఆట‌గాడిగా ఉత్కంఠ పోరులో త‌న‌ టీమ్ ని గెలిపించే వాడిగా క‌నిపిస్తాడు.

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో హాకీ నేప‌థ్యంలో మొద‌టి ప్ర‌య‌త్న‌మిదే. ఈ చిత్రంలో రావు రమేష్ - మురళి శర్మ- పోసాని కృష్ణ మురళి- ప్రియదర్శి- సత్య త‌దిత‌రులు న‌టిస్తున్నారు. కవిన్ రాజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా.. రామజోగయ్య శాస్త్రి- సామ్రాట్ సాహిత్యం అందిస్తున్నారు. హిప్ హాప్ థ‌మీజా సంగీతం అందించారు.

ఈ శుక్ర‌వారం(మార్చి 5) థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న‌ సంద‌ర్భంగా ఏ1 స్టార్ సందీప్ కోసం మెగా సెన్సేష‌న‌ల్ హీరోలు వ‌రుణ్ తేజ్.. పంజా వైష్ణ‌వ్ తేజ్ బ‌రిలో దిగి త‌మ‌వంతు ప్ర‌చారం చేస్తున్నారు. ఇదిగో ఇలా హాకీ జెర్సీలు ధ‌రించి హాకీ స్టిక్ ప‌ట్టుకుని ఆట‌కు సిద్ధంగా క‌నిపించారు. మొత్తానికి ఏ1 ఎక్స్ ప్రెస్ కి కావాల్సినంత మెగా ప్ర‌చారం ద‌క్కిన‌ట్టే. ఉప్పెన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో వైష్ణ‌వ్ తేజ్ క్రేజు అమాంతం స్కైని ట‌చ్ చేస్తుంటే.. వ‌రుస ప్ర‌యోగాల‌తో స్పీడ్ మీదున్న వ‌రుణ్ తేజ్ బాక్సింగ్ కాన్సెప్ట్ సినిమా చేస్తూ హాకీ నేప‌థ్య చిత్రానికి ప్ర‌చారం చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. మ‌రి కాసేప‌ట్లోనే ఈ మూవీ స‌మీక్ష‌ల కోసం.. వెయిట్ అండ్ వాచ్ తుపాకి..