Begin typing your search above and press return to search.

మెగా ప్రిన్స్ బ‌ర్త్ డే గిఫ్ట్ 'ప‌వ‌ర్ ఆఫ్ గ‌ని'

By:  Tupaki Desk   |   19 Jan 2022 6:36 AM GMT
మెగా ప్రిన్స్ బ‌ర్త్ డే గిఫ్ట్ ప‌వ‌ర్ ఆఫ్ గ‌ని
X
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న చిత్రం `గ‌ని`. ఎన్ని సినిమాలు చేశామ‌న్న‌ది కాదు ఎలాంటి సినిమాలు చేశామ‌న్న‌ది ముఖ్యం అనే పంథాలో వ‌రుస‌గా విభిన్న‌మైన చిత్రాల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని సొంతం చేసుకుంటున్నారు వ‌రుణ్ తేజ్. నేడు ఆయ‌న పుట్టిన రోజు. ప్ర‌స్తుతం ఆయ‌న `ఎఫ్ 2` సీక్వెల్ `ఎఫ్ 3`తో పాటు స్పోర్ట్స్ డ్రామా `గ‌ని`లో న‌టిస్తున్నారు. బుధ‌వారం హీరో వ‌రుణ్ తేజ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా `గ‌ని` చిత్రం నుంచి `ప‌వ‌ర్ ఆఫ్ గ‌ని` పేరుతో మేక‌ర్స్ స‌ర్ ప్రైజ్ ఇచ్చారు.

బాలీవుడ్ బామ స‌యీ ముఖ‌ర్జీ హీరోయిన్ గా న‌టిస్తున్నఈ చిత్రం ద్వారా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఆయ‌న పెద్ద‌కుమారుడు అల్లు బాబి, సిద్దు ముద్ద‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన `ప‌వ‌ర్ ఆఫ్ గ‌ని` సినిమా ప‌వ‌ర్ ని తెలియ‌జేస్తోంది. మూవీలో వ‌రుణ్ తేజ్ గ‌ని అనే ప‌వ‌ర్ ఫుల్ బాక్స‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి మెంట‌ర్ గా ఈ వీడియోలో క‌నిపిస్తున్నారు.

ఆయ‌న శిక్ష‌ణ‌లో రాటుదేలిన గ‌ని ప్ర‌త్య‌ర్థుల్ని బాక్సింగ్ రింగ్ లో , బ‌యట మ‌ట్టి క‌రిపిస్తున్నతీరు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ మూవీ కోసం క‌ఠోరంగా శ్ర‌మించిన వ‌రుణ్ తేజ్ రియ‌ల్ బాక్స‌ర్‌గా త‌న‌ని తాను మార్చుకున్న తీరు, ఆయ‌న మేకోవ‌ర్ ఆక‌ట్టుకుంటోంది. సునీల్ శెట్టి శిక్ష‌ణ ఇస్తున్న స‌మ‌యంలో వ‌రుస‌గా పేర్చి టైర్ ల‌ని వ‌రుణ్ చేతుల‌కు ఎలాంటి ర‌క్ష‌ణ లేకుండా పంచ్ చేస్తున్న తీరు, విల‌న్ ల‌ని మ‌ట్టిక‌రిపించే ద‌శ‌లో వారిపై పిడిగుద్దులు కురిపిస్తున్న స‌న్నివేశాల్లో కార్ ల‌కి వ‌రుణ్ పంచ్ ఇచ్చిన తీరు క్యారెక్ట‌ర్ ఏ స్థాయి ఇంటెన్స్ తో సాగ‌నుంద‌న్న‌ది స్ప‌ష్టం చేస్తోంది.

బాక్సింగ్ డ్రామాగా రూపొందుతున్న ఈమూవీలోని కీల‌క పాత్ర‌ల్లో బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి, క‌న్న‌డ క్రేజీ హీరో ఉపేంద్ర న‌టిస్తున్నారు. ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో జ‌గ‌ప‌తిబాబు, న‌వీన్ చంద్ర‌, న‌దియా, సీనియ‌ర్ న‌రేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి క‌నిపించ‌బోతున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా `కొడితే.... ` అంటూ సాగే ప్ర‌త్యేక గీతం లో న‌టించింది. ఈ పాట‌కు సంబంధించిన లిరిక‌ల్ వీడియోని మేకర్స్ ఇటీవ‌ల విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

బాక్సింగ్ రింగ్ లో మిల్కీ బ్యూటి త‌మ‌న్నా హోయ‌లు పోతూ చేసిన ఈ పాట సినిమాకు హైలైట్ గా నిల‌వ‌బోతోంది. వ‌రున్ తేజ్ భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీని రిలీజ్ కోవిడ్ కార‌ణంగా నాలుగైదు సార్లు మారుతూ వ‌చ్చింది. తాజాగా మూవీని మార్చి 18న రిలీజ్ చేస్తున్న‌ట్టుగా చిత్ర వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. వ‌రుణ్ కెరీర్‌లోనే భారీ స్థాయిలో ఈ మూవీ విడుద‌ల‌కు సిద్శ‌మవుతోంది.