వదిలేసిన కథలతోనే మెగా హీరో

Thu Dec 03 2015 12:43:12 GMT+0530 (IST)

Varun Tej Picked Feel My Love Script from Nani

ముకుంద - కంచె సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. నటుడిగా మెరుగ్గానే రాణిస్తున్నాడని పాజిటివ్ టాక్ వినిపించింది. ప్రారంభం ఘనమే. ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లోఫర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ప్రచార ఫర్వం ఊపందుకోనుంది. అయితే ఈలోగానే మెగా హీరో గురించి రకరకాల విషయాలు టాలీవుడ్ లో చర్చకొచ్చాయిఈ హీరో వేరొక హీరో వద్దనుకున్న స్ర్కిప్టులన్నిటినీ తెలివిగా ఒడిసిపట్టుకుంటున్నాడన్న ఇంట్రెస్టింగ్ చర్చ సాగుతోంది. కంచె కథ ముందుగా మహేష్ దగ్గరికి వెళ్లింది. క్రిష్ అలియాస్ జాగర్ల మూడి రాధాకృష్ణ ఈ కథని ముందుగా ప్రిన్స్ కే చెప్పాడు. కానీ మహేష్ కాదనుకున్నాడు. అప్పట్లో శివం టైటిల్ తో  వినిపించింది కంచె కథనే అని అనుకుంటున్నారంతా. అలాగే లోఫర్ మూవీ మొదట నితిన్ హీరోగా చేయాలనుకున్నది. పూరీతో విభేధాలు రావడంతో నితిన్ ఆ ప్రాజెక్టు నుంచి వాకౌట్ చేశాడు. అప్పుడు ఆ కథే వరుణ్ తేజ్ సెలక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు లోఫర్ రిలీజ్ కి వస్తోంది.

అలాగే దిల్ రాజు ఇటీవలే ఫీల్ మై లవ్ అనే టైటిల్ ని రిజిష్టర్  చేయించారు. వెంకీ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాకి కథ రాసుకున్నారు. ఇందులో నాని నటించాల్సిందే. కానీ నాని అనూహ్యంగా ఆ ప్రాజెక్టు నుంచి వాకౌట్ చేశాడు. ఇప్పుడు అదే కథని వరుణ్ తేజ్ ఎంపిక చేసుకున్నాడని చెబుతున్నారు. ఇలా వేరే హీరోలు వదిలేసుకున్న కథల్ని తెలివిగా గుప్పిట పట్టేస్తున్నాడు వరుణ్ తేజ్.