వ్యోమగామి ఫిట్నెస్ అదిరిపోయిందిగా..

Tue May 15 2018 14:09:48 GMT+0530 (IST)

కంచె సినిమా సాధించిన విజయం వరుణ్ తేజ్‌ను నిలబెట్టింది. ఆ తరువాత చేసిన లోఫర్ మిస్టర్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో హీరోగారి పనైపోయింది అనుకున్నారు. అదే సమయంలో ఫిదా సినిమా బంపర్ విజయం సాధించి అవకాశాలు తెచ్చిపెట్టింది. ఒక తొలిప్రేమ వరుణ్‌లోని ప్రేమికుడిని ప్రేక్షకులకు చూపించింది. ఫిదా తొలిప్రేమ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్‌లు కొట్టడంతో వరుణ్ దృష్టి హ్యాట్రిక్‌పై పడింది. ప్రస్తుతం అతను చేస్తున్న సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తన లుక్‌ను కూడా మార్చుకున్నాడు.ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఆస్ట్రోనాట్‌గా నటిస్తున్నాడు వరుణ్ తేజ్. ఇందుకోసం గెడ్డాలు మీసాలు పెంచి కనిపించాడు. ఫస్ట్ లుక్ లో వరుణ్ డిఫరెంట్‌గా అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. తాజాగా వరుణ్ ఫోటో ఒకటి బయటికొచ్చింది. ఆ ఫోటోలో గెడ్డం లేకుండా నీట్ గా షేవ్ చేసుకుని ఉన్నాడు. ఆ లుక్ చూస్తుంటే కంచెలో సైనికుడి పాత్ర గుర్తుకొస్తోంది. ఆ మీసం హెయిర్ కట్ అన్నీ కంచె లుక్‌ను గుర్తుకుతెస్తున్నాయ్. అయితే ఫిట్నెస్ లెవెల్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. చూడ్డానికి భలే స్టయిలిష్ గా ఉన్నాడు. పై ఫోటోలో షూటింగ్ లేని సమయంలో వరుణ్ తన పెట్ తో ఆడుకుంటూ ఉన్నాడు.

దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ సినిమా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.  ఈ సినిమా అంతరిక్షం నేపథ్యంలో జరిగే కథ. దీనిని టైటిల్ ఖరారు చేసే పనిలో పడింది చిత్రయూనిట్. దర్శకుడు అహం బ్రహ్మస్మి అనే టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. కథ తో పోల్చుకుంటే ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని అతను భావిస్తున్నాడట. అలాగే వ్యోమగామి అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. ఇందులో లావణ్య త్రిపాఠి అదితిరావ్ హైదరి హీరోయిన్లుగా కనిపించనున్నారు.