Begin typing your search above and press return to search.

వరుణ్‍‍ ‍తేజ్‌- లావ‌ణ్య త్రిపాఠి నిశ్చితార్థ ముహూర్తం

By:  Tupaki Desk   |   9 Jun 2023 6:28 PM GMT
వరుణ్‍‍ ‍తేజ్‌- లావ‌ణ్య త్రిపాఠి నిశ్చితార్థ ముహూర్తం
X
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి ని ప్రేమ వివాహం చేసుకుంటున్నార‌ని ఇటీవ‌ల మీడియా లో క‌థ‌నాలొచ్చాయి. ఈ జంట ఒక‌ట‌వుతున్నార‌ ని ఈ సాయంత్రం (09-06-2023) అతికొద్ది మంది బంధు మిత్రుల స‌మ‌క్షంలో నాగ‌బాబు స్వ‌గృహం(హైద‌రాబాద్)లో ప్ర‌యివేటు గా నిశ్చితార్థం జ‌ర‌గ‌నుంద‌ని తెలిసింది. నేటి సాయంత్రం 7 గం.ల‌ నుండి 8 గంటల మ‌ధ్య నిశ్చితార్థ అంగుళీక ధార‌ణ‌ కు దివ్య ముహూర్తాన్ని ఫిక్స్ చేశార‌ ని .. లావణ్య కుటుంబం స‌హా మెగా - అల్లు కుటుంబ సభ్యులు ఈ వేడుక‌ లో పాల్గొన‌నున్నార‌ని తెలుస్తోంది.

ఈ నిశ్చితార్థాని కి ప్ర‌త్యేక శోభ‌ ను తెచ్చేందుకు ప్ర‌ముఖ డిజైన‌ర్స్.. స్టైలిష్ట్స్ వ‌ధూవ‌రుల ప్ర‌త్యేక కాస్ట్యూమ్స్ స్టైలింగ్ పై వ‌ర్క్ చేశార‌ని తెలిసింది. వరుణ్ తేజ్ దుస్తుల్ని డిజైనర్ తరుణ్ తహిలియా ని రూపొందించ‌గా.. అశ్విన్ మావ్లే లావణ్యకు స్టైలింగ్ చేసారు. డిజైనర్ అనితా డోంగ్రే లావ‌ణ్య త్రిపాఠి స్పెష‌ల్ లుక్ ని డిజైన్ చేశార‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం వరుణ్ తేజ్ కెరీర్ ప‌రం గా బిజీ గా ఉన్నారు. ఆగస్టు 25న అత‌డు న‌టించిన 'గాండీవధారి అర్జున' (#VT12) విడుదల కానుంది. VT13 పాన్ ఇండియా ప్రాజెక్ట్... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా వ‌రుణ్ తేజ్ క‌నిపిస్తారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ చిత్రాని కి ద‌ర్శ‌కుడు. కరుణ కుమార్ (పలాస ఫేమ్)తో కలిసి VT14 వైరా ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తోంది.

లావణ్య త‌మిళం లో అథర్వ స‌ర‌స‌న ఓ చిత్రం లో న‌టిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న సినిమా లోను నాయిక‌గా న‌టిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ హాట్ స్టార్ వెబ్ సిరీస్ తో న‌టి గా త‌న‌ లో కొత్త కోణాన్ని ఎలివేట్ చేయ‌నుంది.