Begin typing your search above and press return to search.

వరుణ్, లావణ్య ఎంగేజ్మెంట్... ఇట్స్ అఫీషియల్..!

By:  Tupaki Desk   |   8 Jun 2023 11:03 AM GMT
వరుణ్, లావణ్య ఎంగేజ్మెంట్... ఇట్స్ అఫీషియల్..!
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనేది వార్తల సారాంశం. కాగా, కొద్ది రోజులగా వీరి నిశ్చితార్థానికి ముహూర్తం సెట్ అయ్యిందని కూడా ప్రచారం జరిగింది. కానీ ఎన్ని ప్రచారాలు జరిగినా అటు మెగా ఫ్యామిలీ కానీ, ఇటు లావణ్య ఫ్యామిలీ కానీ స్పందించలేదు. కానీ, తాజాగా దీనిపై అధికారిక ప్రకటన చేశారు. మెగా టీమ్ సోషల్ మీడీయా వేదికగా వీరి ఎంగేజ్మెంట్ డేన్ ని కన్ఫామ్ చేసింది.

జూన్ 9వ తేదీన వీరి నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇక సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే. ఈ నిశ్చితార్థంలో మెగా హీరోలు అందరూ ఉండాలని అనుకుంటున్నారట. అందుకే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ డేట్స్ కి ఇబ్బంది కలగకుండా, వారందరికీ కన్వినెంట్ గా ఉండేలా ఈ రోజును సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిశ్చితార్థానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆరోజే పెళ్లి తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

ఇక, లావణ్య చాలా కాలంగా తన పెళ్లి కోసమే వచ్చే ఆఫర్లు అన్నింటినీ రిజెక్ట్ చేస్తూ వస్తోంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే ఆమె తన పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ కెరీర్ ని వదిలిపెట్టాలని అనుకోవడం లేదట. ఆమె తర్వాత కూడా సినిమాలు చేస్తుంది. ఆమె ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో పలు వెబ్ సిరీస్ లు అంగీకరించింది. వాటిని పూర్తి చేసే పనిలో ఉంది. ఇటీవల పులి-మేక వెబ్ సిరీస్ తో ఆమె ఆకట్టుకున్నారు. దానికి సీక్వెన్స్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉండగా, వరుణ్, లావణ్యలకు మిస్టర్ మూవీ సమయంలో పరిచయం ఏర్పడింది. 2017లొ తెరకెక్కిన ఈ సినిమాకి శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. ఈ మూవీ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. ఆ మూవీ హిట్ కాకపోయినా, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం విశేషం. ఆ తర్వాత అంతరిక్షంలోనూ వీరిద్దరూ జంటగా కనిపించారు. ఇక లావణ్య ఉత్తరప్రదేశ్ కి చెందిన యువతి కాగా, అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

ప్రస్తుతం వరుణ్ తేజ్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి... ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాంఢీవదారి అర్జున'. మరొకటి... ఏవియేషన్ థ్రిల్లర్. దానిని సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం బుడాపెస్ట్ సిటీలో ప్రవీణ్ సత్తారు యాక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ చేస్తున్నారు.