గద్దలకొండ గణేష్ గట్టెక్కేసాడా?

Mon Sep 23 2019 10:55:27 GMT+0530 (IST)

Varun Tej Gaddalakonda Ganesh Runs With Positive Buzz

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదటిసారి ఊరమాస్ అవతారంలో నటించిన గద్దలకొండ గణేష్ ఫస్ట్ వీక్ ఎండ్ ని సక్సెస్ ఫుల్ గా దాటేసింది. టాక్ విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ మాస్ ప్రేక్షకుల అండతో మొదటి మూడు రోజులకే బయ్యర్లు సేఫ్ అయ్యారని ట్రేడ్ టాక్. రీజనబుల్ బిజినెస్ జరగడంతో నష్టాలు వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు.ఒరిజినల్ వెర్షన్ జిగర్ తండా చూసిన క్లాస్ ప్రేక్షకులు క్లాసిక్ ని మార్పులు చేసి చెడగొట్టారని కామెంట్ చేస్తుండగా దాని మీద అవగాహన లేని మాస్ బ్యాచ్ మాత్రం తాము కోరుకున్నవి ఉన్నాయి కాబట్టి పైసా వసూల్ అనే సర్టిఫికేట్ ఇస్తున్నారు. వీక్ డేస్ లో గణేష్ ఎలా పర్ఫార్మ్ చేస్తాడన్నది కీలకంగా మారింది. సైరాకు ఇంకా 10 రోజుల సమయం ఉంది కాబట్టి దీన్ని వాడుకోవడం చాలా అవసరం

మరోవైపు నిర్మాతలకు పెట్టుబడి ఈ మూడు రోజుల్లోనే వచ్చేసిందని మరో ఇన్ సైడ్ న్యూస్. వేరే పోటీ సినిమా ఏదీ లేకపోవడం ఉన్న సూర్య బందోబస్త్ కు డిజాస్టర్ టాక్ రావడం గణేష్ కి బాగా కలిసి వచ్చింది. మైనస్సులు ఉన్నప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్స్ పరంగా ఉన్న ప్లస్ పాయింట్స్ హరీష్ శంకర్ ని పాస్ అయ్యేలా చేశాయి. ఈ వారాంతం దాకా ఇదే స్టడీనెస్ ని కొనసాగిస్తే గణేష్ మంచి లాభాలు కళ్ళజూడటం ఖాయం. దీని గురించి క్లారిటీ రావాలంటే మాత్రం ఇంకో రెండు మూడు రోజులు వేచి చూడాల్సిందే. ట్రేడ్ కూడా దీని మీద ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది