మెగా డాటర్ డెస్టినేషన్ వెడ్డింగ్.. పెళ్లి ఏర్పాట్లలో మెగా బ్రదర్..!

Sat Oct 17 2020 15:40:52 GMT+0530 (IST)

Mega Daughter Destination Wedding .. Mega Brother in Wedding Arrangements ..!

మెగా బ్రదర్ నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక కొణిదెల వివాహం త్వరలో జరగనుందనే విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో ఇటీవలే నిహారిక - చైతన్యల నిశ్చితార్థం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. వీరి వివాహం ఈ ఏడాది చివర్లో జరగనుందని సమాచారం. త్వరలో మెగా కుటుంబంలో పెళ్లి భాజాలు మోగనున్న నేపథ్యంలో తాజాగా నాగబాబు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్ళికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.నాగబాబు మాట్లాడుతూ.. ''నిహారిక వివాహం విషయంలో మేమెంతో సంతోషంగా ఉన్నాం. కరోనా కారణంగా ఈ ఏడాది ఎంతో క్లిష్టంగా మారింది. ఇలాంటి కఠిన సమయం నుంచి కొంతవరకు బయటకు రావడానికి మా ఫ్యామిలీలో శుభకార్యం జరగడం ఎంతో ఆనందంగా అనిపిస్తోంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను నా కొడుకు వరుణ్ తేజ్ చూసుకుంటున్నాడు. డిసెంబర్ నెలలో నిహారిక - చైతన్యల డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. పెళ్లి తేదీని త్వరలోనే అందరికీ తెలియజేస్తాం. వివాహానికి సంబంధించి వరుణ్ తేజ్ ఇప్పటికే కొన్ని ప్రాంతాల జాబితా రెడీ చేశాడు'' అని పేర్కొన్నాడు. ఇంతకముందు నాగబాబు ఓ వీడియో ద్వారా 'ఇంత మంచి ఫ్యామిలీకి మా అమ్మాయి కోడలుగా వెళ్లడం ఆనందంగా ఉంది. మంచి వ్యక్తులతో వియ్యం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది' అని చెప్పారు.

కాగా నిహారిక ముందుగా చైతన్యతో దిగిన ఫొటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకొని పెళ్లి విషయాన్ని వెల్లడించింది. ఇదే క్రమంలో గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో నిహారిక పెళ్లి చేయబోతున్నట్లు నాగబాబు కూడా ప్రకటించారు. ఆగస్టు నెలలో అతి తక్కువ మంది అతిథులు కుటుంబసభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. కొన్నిరోజుల క్రితం నిహారిక తన స్నేహితులతో కలిసి గోవాలో బ్యాచిలరేట్ పార్టీ చేసుకున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.