Begin typing your search above and press return to search.

తమ్ముడు బర్త్ డేకి..అన్న వరుణ్ తేజ్ ఫన్నీ ట్వీట్!

By:  Tupaki Desk   |   8 April 2020 2:31 PM GMT
తమ్ముడు బర్త్ డేకి..అన్న వరుణ్ తేజ్ ఫన్నీ ట్వీట్!
X
ఈ రోజు టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్‌ - అఖిల్‌ అక్కినేని - అకీరా బ‌ర్త్‌ డే కావ‌డంతో వారికి ప్ర‌ముఖుల నుండి శుభాకాంక్ష‌ల వెల్లువ కురుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నుండి మొదలుకొని ప్రతి ఒక్కరూ వీళ్ళకి బర్త్ డే విషెస్ చెప్తూ సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. ఇక అకిరా నందన్ విషయానికొస్తే.. ఒక్క సినిమా కూడా చేయకపోయినా కూడా మెగా వారసుడు అనే ఒకే ఒక్క క్రేజ్‌ తో ఈయన పేరు మార్మోగిపోతుంది. ఈరోజు బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ అకీరాకి ఆశీస్సులు అందించాడు. ''మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగి పోయిన ఈ బిడ్డ ఎత్తులో (6'4") అందరికంటే ఎదిగి పోయాడు. అన్ని విషయాల్లోనూ ఇలాగే అందరిని మించిపోవాలి. విష్ యూ పవర్ ఫుల్ ఫ్యూచర్. హ్యాపీ బర్త్ డే'' అంటూ పోస్ట్ చేశారు. మెగా హీరోలు రామ్ చ‌ర‌ణ్‌ - వ‌రుణ్ తేజ్‌ - సాయి ధ‌ర‌మ్ తేజ్ వీరికి ప్ర‌త్యేకంగా బ‌ర్త్‌ డే శుభాకాంక్ష‌లు తెలిపారు. ఫ్యామిలీ ఫోటో షేర్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌.. ''నా పొడవైన సోదరుడు అకీరాకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. దేవుడు నిన్ను చ‌ల్ల‌గా చూస్తాడు. ఎల్ల‌ప్పుడూ ద‌య‌గ‌ల వ్య‌క్తిగా ఉండు'' అని విషెస్ చెప్పాడు. అయితే వీళ్లందరిలో మెగా హీరో వరుణ్ తేజ్ చెప్పిన బర్త్ డే విషెస్ అందర్నీ ఆకర్షిస్తోంది.

''హ్యాపీ బ‌ర్త్‌ డే త‌మ్ముడు.. ఇన్నాళ్ల‌కి నా సోద‌రుడు నన్ను త‌ల‌పైకి ఎత్తేలా చేశాడు'' అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెటిజన్లను నవ్విస్తోంది. అంతేకాకుండా వరుణ్ తేజ్ అకీరా రీసెంటుగా దిగిన పిక్ కూడా షేర్ చేసాడు. ఈ ఫొటోలో అకీరా వరుణ్ తేజ్ కంటే ఎత్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. అకీరా మెగా హీరోలందరికంటే ఎత్తుగా (6'4") ఉంటాడు. ఈ పోస్ట్ చూసిన మెగా అభిమానులు విపరీతంగా నవ్వుకుంటున్నారు. ఇదిలా ఉండగా బర్త్ డే సందర్భంగా బయటకి వచ్చిన అకీరా టాలీవుడ్ లో ఎంట్రీ గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే అకిరా మరాఠీలో ఓ సినిమా చేశాడు. రేణు దేశాయ్ తెరకెక్కించిన 'ఇష్క్ వాలా లవ్' సినిమాలో అకీరా నటించిన విషయం తెలిసిందే. పవన్ వారసున్ని నేరుగానే ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. మెగా కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా ఆదరించడానికి మెగా అభిమానులు సిద్దంగా ఉంటారని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఇప్పుడు అకీరాకి కూడా గ్రాండ్ వెల్ కమ్ చెప్పడానికి మెగా ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు.