ఇందువదన: బోల్డ్ లుక్ తో వరుణ్ సందేశ్ షాకింగ్ ట్విస్ట్

Mon May 03 2021 11:00:01 GMT+0530 (IST)

 Varun Sandesh shocking twist with bold look

హ్యాపీడేస్- కొత్తబంగారు లోకం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించాడు వరుణ్ సందేశ్. కొన్ని పరాజయాలతో కెరీర్ పరంగా రేసులో వెనకబడిన సంగతి తెలిసిందే. కొంత గ్యాప్ తర్వాత ఈ యంగ్ ట్యాలెంటెడ్ హీరో తిరిగి బరిలోకి వచ్చాడు. అతడు నటిస్తున్న తాజా చిత్రం `ఇందువదన`. ఫర్నాజ్ శెట్టి కథానాయిక. ఎం.ఎస్.ఆర్ దర్శకుడు. మాధవి ఆదుర్తి నిర్మాత.తాజాగా నాయకానాయికల బోల్డ్ అండ్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ ని చిత్రబృందం లాంచ్ చేసింది. ఇందువదనా టైటిల్ కి తగ్గట్టే ఈ లుక్ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా వరుణ్ మునుపెన్నడూ కనిపించనంత కొత్తగా పీరియాడిక్ ఎలివేషన్ తో తన అభిమానుల ముందుకు వస్తున్నాడు. క్లాసిక్ డేస్ కళాకారుడిలా శోభన్ బాబు రింగుతో  అతడి రూపం మెస్మరైజ్ చేస్తోంది.

పంచెకట్టు దోతీ.. మెడలో రుద్రాక్ష మాల.. ఇదంతా చూస్తుంటే అతడు క్లాసిక్ నే టచ్ చేస్తున్నాడనిపిస్తోంది. యువకథానాయిక ఎంకిలాగా..  చేనేత చీరలో టాప్ లెస్ ఫోజుతో రొమాంటిక్ మూడ్ లో కనిపిస్తోంది. నాయకానాయికల ప్రైమైక జీవనానికి సింబాలిక్ ఈ ఫోటోషూట్. కౌగిలింతలో ప్రేమపక్షుల కుహకుహలు ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాయి. సంథింగ్ ఈజ్ దేర్.. అంటూ ఎదురు చూసేలా ఈ లుక్ ని తీర్చిదిద్దిన తీరు ఆసక్తిని కలిగిస్తోంది.

ఏదైనా సంథింగ్ లేకపోతే ఈ రోజుల్లో జనాల్ని థియేటర్లకు రప్పించడం కష్టం. అందుకే ఈసారి సరికొత్త కథతో వేవ్ లాగా వస్తున్నాడు వరుణ్ సందేశ్. మునుపటి పంథాకి భిన్నంగా అతడు తన కెరీర్ ని కొత్త వేలో పరుగులు పెట్టిస్తాడేమో చూడాలి. వరుణ్ ఫ్యాన్స్ ఆ క్షణం కోసమే ఆసక్తిగా వెయిటింగ్.