వరుణ్ వచ్చేశాడు.. 7నే తాంబూలం

Thu Dec 03 2015 13:29:34 GMT+0530 (IST)

Varun Sandesh discharged from hospital

కుర్రహీరో వరుణ్ సందేశ్ కి తీవ్ర జ్వరం కారణంగా హాస్పిటల్ లా చేరిన విషయం తెలిసింది. తన ఫియాన్సీ టైఫాయిడ్ - డెంగ్యూలతో బాధ పడుతున్నాడని త్వరగా కోలుకోవాలని ప్రార్ధించమంటూ.. పెళ్లి కూతురు వితిక షేరు ట్వీట్ చేయడంతో.. వరుణ్ అనారోగ్యం విషయం అందరికీ తెలిసింది. అయితే.. ఫ్యాన్స్ ని హడావిడి పెట్టడం ఇష్టంలేని వరుణ్ సందేశ్.. తనకు ఎలాంటి అనారోగ్యం లేదంటూ ట్వీట్ పెట్టడంతో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది.అయితే.. వరుణ్ మాత్రం నిజంగానే ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. అయితే. టైఫాయిడ్ - డెంగ్యులతో కాదు.. మలేరియా జ్వరం రావడంతో.. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు వరుణ్ సందేశ్. ఆరోగ్యం కొంత కుదుటపడ్డంతో.. ప్రస్తుతం ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ కూడా అయిపోయాడు. తన కుమారుడు ఇప్పుడు ఓకే అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొన్ని వారాలపాటు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ చెప్పాడంటూ.. వరుణ్ సందేశ్ తండ్రి వెల్లడించాడు. మొత్తానికి ఈ కుర్రాడు ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చేయడంతో.. నిశ్చితార్ధం పక్కా అయిపోయింది. ఈ నెల 7న హైద్రాబాద్ లోని ఓ స్టార్ హోటల్ నిశ్చితార్ధం చేసుకోబోతున్నట్లు.. గత నెలలోనే ఇన్విటేషన్స్ పంచారు ఈ జంట.

అయితే.. వరుణ్ సందేశ్ అనారోగ్యం కారణంగా.. ఈ కార్యక్రమంపై కొంత సందిగ్ధత నెలకొంది. కానీ ఇప్పుడు పెళ్లి కొడుకు ఆస్పత్రి నుంచి ఇంటికి చేరడంతో... రెండు కుటుంబాలు నిశ్చితార్ధం పనుల్లో పడిపోయాయి. ఇంకా చాలామందికి ఇన్విటేషన్స్ పంపాలంటూ హడావిడి పడిపోతున్నారు కూడా.