Begin typing your search above and press return to search.
జూనియర్ సల్మాన్ - సమంత రాష్ట్రపతి తో భేటీ
By: Tupaki Desk | 8 Jun 2023 11:45 PMజూనియర్ సల్మాన్ - సమంత జంట గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జోడీ మేడ్ ఫర్ ఈచ్ అదర్! అంటూ ఇప్పటికే కాంప్లిమెంట్లు అందుకుంటున్నారు. సిటాడెల్ పోస్టర్లు వీడియోల తో ఇప్పటికే బోలెడంత హైప్ పెంచడం లో ఈ జంట సక్సెసైంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న 'సిటాడెల్' భారతీయ వెర్షన్ మెజారటీ భాగం చిత్రీకరణ పూర్తయింది.
ప్రస్తుతం ఇండియన్ వెర్షన్ 'సిటాడెల్' షూటింగ్ లో ఉన్న వరుణ్ ధావన్ - సమంతా రూత్ ప్రభు ఇటీవల సెర్బియా లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. ఈ సమావేశం నుండి ఫోటోల ను షేర్ చేస్తూ వరుణ్ ధావన్ ఇన్ స్టాగ్రామ్ లో ఇలా రాసాడు. టీమ్ సిటాడెల్.. ఇండియా గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ని కలిసే అవకాశం కలిగింది. సెర్బియాలో ద్రౌపది ముర్ము జీ. మేడమ్ @presidentofindia .. మిమ్మల్ని కలవడం ఎంతో గొప్ప ఆనందాన్ని గౌరవాన్ని ఇచ్చింది... అని వ్యాఖ్యానించారు.
వరుణ్ బ్లూ షర్ట్ - బ్లాక్ ప్యాంట్ లో ఫార్మల్ లుక్ డాపర్ గా కనిపించగా.. సమంత బ్లాక్ టాప్ - బ్లూ జీన్స్ లో గమ్మత్తుగా కనిపించింది. సామ్ స్మైల్ సో క్యూట్ అంటూ ఈ ఫోటోలు చూశాక అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. సిటాడెల్ నటీనటులు ఇతర బృందం గౌరవనీయు లైన భారత రాష్ట్రపతి తో కెమెరా కు పోజులిచ్చారు. వరుణ్ ఫోటోల ను షేర్ చేయగానే అన్ని వైపుల నుండి లైక్ లు కామెంట్‌లు వచ్చాయి. ఒక అభిమాని 'లుకింగ్ డ్యామ్ హ్యాండ్సమ్ VD' అని రాస్తే... మరొకరు 'అభినందనలు వరుణ్ సర్' అని రాసారు. మరి కొందరు క్లాప్ ఫైర్ ఎమోజీల ను షేర్ చేసారు. జూనియర్ సల్మాన్ - సమంత జంట ఎంతో ముచ్చటగా ఉన్నారంటూ కొందరు కాంప్లిమెంట్లు ఇచ్చారు.
సిటాడెల్ లో ప్రియాంక చోప్రా పాత్ర కు తల్లి గా నటిస్తున్నట్లు సమంత ఇటీవల ధృవీకరించిన సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా జోనాస్ నటించిన ఇటీవలే ప్రసారమైన ఒరిజినల్ సిరీస్ కి సిటాడెల్ లోని భారతీయ విభాగం అనుసంధానించబడినందున ఈ ప్రాజెక్ట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఒరిజినల్ సిటాడెల్ కి పని చేసిన యాక్షన్ డైరెక్టర్ జేమ్స్ యంగ్ తో రాజ్ అండ్ డీకే బృందం సన్నిహితంగా ఉంది. అమెరికన్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా - రిచర్డ్ మాడెన్ ప్రధాన పాత్రలు పోషించారు. జో రస్సో తో పాటు సిటాడెల్ ఒక్కో విభాగానికి ఒక్కొక్క దర్శకుడు పని చేసారు. ఇండియన్ వెర్షన్ కి రాజ్ & డికె దర్శకత్వం వహిస్తున్నారు.