హీరోగారు గుట్టు చప్పుడు కాకుండా పెళ్లాడాలనుకున్నాడా?

Sat Jan 23 2021 23:00:01 GMT+0530 (IST)

Varun Dhawan And Natasha Dalal Wedding

సదరు యువజంట పెళ్లెప్పుడో తెలీదు కానీ.. ఇంతలోనే హనీమూన్ కి రెడీ అయిపోతున్నారట. ముంబై మీడియా వరుస కథనాలతో ప్రస్తుతం యువహీరో వరుణ్ ధావన్- నటాషా దలాల్ వివాహం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ధావన్ ఫ్యామిలీ ప్రతిదీ గుట్టు చప్పుడు చేయకుండా చేస్తుండడంతో ఒకటే గుసగుసలు ఊహాగానాలు వేడెక్కించేస్తున్నాయ్.జూనియర్ సల్మాన్ గా వరుణ్ ధావన్ కి ఉన్న ఐడెంటిటీ తెలిసినదే. అయితే తన గురువులా కాకుండా చిరకాల ప్రేయసి నటాషా దలాల్ ని పెళ్లాడేందుకు రెడీ అవుతుండడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఈ జంట ఇప్పటివరకూ పెళ్లి వార్తను ధృవీకరించకపోయినా.. ప్రస్తుత పరిణామాలు పెళ్లి బాజాను సూచిస్తున్నాయి. తాజా స్పాటింగ్ లో వరుణ్ ధావన్... నటాషా దలాల్ .. ఇరువురి కుటుంబాలు వివాహం కోసం అలీబాగ్ కు వెళ్లారని తెలుస్తోంది.  ఈ వీకెండ్ లో పెళ్లి జరగనుందని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత  వెల్లడించడం ఆసక్తికరం.

ఇప్పటికే ఈ పెళ్లికి అతిథుల జాబితాపైనా ఆసక్తికర లీకులు అందాయి. కింగ్ ఖాన్ షారుఖ్ .. కరణ్ జోహార్  సహా సల్మాన్ ఖాన్- రెమో డిసౌజా- శశాంక్ ఖైతాన్- శిల్పా శెట్టి- తన భర్త రాజ్ కుంద్రా- వాషు భగ్నానిలను ఆహ్వానించారని ప్రచారమవుతోంది.

ప్రస్తుతం ముంబై బాంద్రాలో ఈ పెళ్లికి సంబంధించిన బోలెడంత హంగామా కనిపిస్తోంది. ఇంకా పెళ్లి బాజా మోగక ముందే.. వరుణ్ - నటాషా జంట టర్కీలో ఆల్రెడీ హనీమూన్ కూడా ప్లాన్ చేశారని కథనాలొస్తున్నాయి. టర్కీలోని ఇస్తాంబుల్ లో అద్భుతమైన సిరాగాన్ ప్యాలెస్ కెంపిన్స్ నిలో వారి హనీమూన్ జరగనుందని తెలుస్తోంది. ది సిరాగన్ ప్యాలెస్ 5 నక్షత్రాల హోటల్... ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన అత్యంత ఖరీదైన హోటళ్లలో ఒకటి.

ఇక కెరీర్ సంగతి చూస్తే.. వరుణ్ ధావన్ వరుసగా మూడు భారీ ప్రాజెక్టుల్లో నటించాల్సి ఉంది. ఇటీవలే రిలీజైన కూలీ నంబర్ 1 రీమేక్ పరాజయం పాలైనా..  కరణ్ జోహార్ నిర్మించిన జగ్ జగ్ జీయో (అతని తదుపరి చిత్రం) పై బోలెడన్ని ఆశలు ఉన్నాయి. బద్లాపూర్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తో కలిసి ఓ మూవీ చేస్తున్నాడు. వేరొక సినిమా చర్చల దశలో ఉంది.