Begin typing your search above and press return to search.
వర్మకి చివరి రోజు..ఆయనకు ఆయనే రాసేసుకున్నాడు!
By: Tupaki Desk | 20 March 2023 1:00 PMసంచలనాల రాంగోపాల్ వుర్మ బ్యాచిలర్ లైఫ్ గురించి ఇచ్చే లెక్చర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. వివాహ బంధంలో ఉండే సాదకబాధకాలు..బ్యాచిలర్ లైఫ్ లో ఉండే? ఆనందాల గురించి కుదిరప్పుడల్లా క్లాస్ తీసుకోవడం వర్మ కి ఎంతో ఇష్టమైన పని. ఇదే కోవలో ఆయన ప్రియ శిష్యుడు పూరి జగన్నాధ్ కూడా యువతని పెళ్లి చేసుకోవద్దని సూచించిన సందర్భాలున్నాయి. ఇక్కడ ఇద్దరు స్టాండ్ ఒక్కటే.
ఉన్నంత కాలం సంతోషంగా ఉండి సింగిల్ గానే జీవితాన్ని ముగించడం అంత ఉత్తమం లేదని చెబుతుంటారు. అలాగని వీళ్లిద్దరు పెళ్లిళ్లు చేసుకోలేదని కాదు. వర్మ సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల కాపురం అనంతరం వివాహ బంధంతో విసుగు చెంది భార్యతో విడిపోయారు. ఇక పూరి జగన్నాధ్ కి పెళ్లయింది. ఇద్దరు పిల్లలు ..భార్యతో కలిసి ఉంటున్నారు.
కానీ పెళ్లి పై మాత్రం ఆయన అభిప్రాయం వర్మతో ఏకీభవిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి లేదు. పిల్లలు లేరు. కాలు చేయి సరిగ్గా పనిచేసినంత కాలం బాగానే సాగుతుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే! ఏం చేస్తారు? డబ్బు కోట్ల రూపాయాలు చేతిలో ఉన్నా? కొన్ని సందర్భాల్లో అందుబాటులో నా అన్నవాళ్లు లేకపోతే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించగా వర్మ అలాంటి పరిస్థితి వస్తే చనిపోతానని అంటున్నారు.
యాక్సిండెంట్ అయి కండీషన్ క్రిటికల్ గా ఉన్నా. మంచాన పడినా? హెల్ప్ లెస్ సిచ్వెషన్ లో ఉంటే తనకు తానుగానే తనువు చాలిస్తానని అన్నారు. అలాంటి పరిస్థితి నుంచి కోలుకోలేని పరిస్థితి ఉంటే తన డెత్ ని తానే రాసుకున్న వాడిని అవుతానని అంటున్నారు. ఆ స్టేజ్ కి వెళ్లిన తర్వాత జీవితాన్ని కొనసాగించడం కూడా వృద్ధాగా చెప్పుకొచ్చారు. జీవితం అంటే ఇంతేనా? అంటే ఉన్నంత కాలం జీవితాన్ని ఆస్వాదించడం మాత్రమే తెలుసుకున్నానని..నేర్చుకున్నానని అందుకే పెళ్లి గురించి ఎవరైనా అడిగితే తన నోట అలాంటి సమాధానాలే వస్తాయని నిర్మొహమాటంగా చెప్పేసారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.