ఒక్క ఛాన్స్ ప్లీజ్.. బాలకృష్ణకు వర్మ రిక్వెస్ట్

Wed Jan 19 2022 11:28:49 GMT+0530 (India Standard Time)

Varma Request to Balakrishna

కొంత మంది సమయం సందర్భాన్ని బట్టి మారుతుంటారు. అప్పుడున్న వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటుంటారు. అలాంటి వ్యక్తుల్లో ముందు వరుసలో నిలుస్తుంటారు రామ్ గోపాల్ వర్మ. వివాదాస్పద ట్వీట్ లతో సంచలనాలు సృష్టించడం.. ఎదుటి వారిని తమ ట్వీట్ లతో కించపరచడం .. ఆ తరువాత తాను ఎవరినైతే విమర్శించాడో వారినే పొగుడతూ ట్వీట్ లు చేయడం కేవలం వర్మకే చెల్లుతోంది. ఇటీవల మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ట్వీట్ లు చేసిన వర్మ ఏపీ టికెట్ రేట్ల వివాదంపై తనకు అండగా నిలిచిన నాగబాబుని అబినందిస్తూ ట్వీట్ లు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.తాఆజగా తన స్టాండ్ మార్చుకుని బన్నీని మెగాస్టార్ అంటూ పొగడ్తలు కురిపిస్తూనే మెగా ఫ్యామిలీ దేశ మంతా బన్నీ బంధులుగా మాత్రమే గుర్తు పెట్టుకుంటారని వివాదాస్పద ట్వీట్ చేయడం తెలిసిందే. ఇంతకీ వర్మ స్టాండ్ ఏంటీ? ఎవరిని పొగుడుతున్నాడు? .. ఎవరిని విమర్శిస్తున్నాడన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. తన చిత్ర విచిత్రమైన ట్వీట్ లతో చాలా మందిని కన్ఫ్యూజన్ లో పెట్టిన వర్మ కన్ను తాజాగా నందమూరి బాలకృష్ణపై పడింది.

అంతే కాకుండా ఆయనతో పాటు ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న `అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె`పై కూడా వర్మ మనసు పారేసుకున్నారు. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తూ సినీ సెలబ్రిటీలతో హంగామా చేస్తున్న విషయం తెలిసిందే. తనదైన పంచ్ లతో చమత్కారాలతో షోలోకి ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీలని బాలయ్య ఆకట్టుకుంటూనే ఫన్ ని జనరేట్ చేస్తున్నారు. దీంతో ఈ షో టాప్ లో ట్రెండ్ అవుతోంది.

ఈ షో పై వర్మ మనసు పారేసుకున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంటర్వ్యూతో ఈ షో మొదలైంది. ఇప్పటికి ఈ షోలో రాజమౌళి పూరి జగన్నాథ్ చార్మి విజయ్ దేవరకొండ గోపీచంద్ మలినేని రవితేజ రష్మిక మందన్న అల్లు అర్జున్ సుకుమార్ రానా నాని బ్రహ్మానందం ఎం.ఎం. కీరవాణి అనిల్ రావిపూడి వంటి వారితో అప్రతిహతంగా సాగిపోతోంది. మహేష్ బాబుతో  బాలయ్య స్పెషల్ ఇంటర్వ్యూ స్త్రీమింగ్ కావాల్సి వుంది.

ఇదిలా వుంటే ఈ షోపై వర్మ కన్నేశాడు. ఇంత మంది సెలబ్రిటీలని పిలిచి బాలయ్య హంగామా చేస్తుంటే నన్నెందుకు పిలవడం లేదని ఇండైరెక్ట్ గా ఆరాతీస్తున్న వర్మ తనదైన పంధాలో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ బాలయ్యని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు. ఇందు కోసం అన్ స్టాపబుల్ టాక్ షో ని ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపించారు. ఇదో స్ట్రాటో ఆవరణ ప్రోగ్రామ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

అంతే కాకుండా నాకు కూడా ఓ అవకాశం ఇవ్వండి` అంటూ అసలు విషయం చెప్పేశారు. ఇప్పటికే ఐఎండీబీలో టాప్ 1 షోగా రేటింగ్ ని సొంతం చేసుకున్న ఈ షోలో ఎంట్రీకి వర్మకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ఇస్తే వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ ఎలా వుంటుంది? .. బాలయ్య ముందు వర్మ కుదురుగా వుంటారా? ఉండకపోతే బాలయ్య ఎలా స్పందిస్తారు? .. `లక్ష్మీస్ ఎన్టీఆర్` ప్రస్తావన వస్తే వర్మ చెప్పే సమాధానం ఏంటీ? .. దీనికి బాలయ్య ఎలా స్పందిస్తారు? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.