Begin typing your search above and press return to search.

ఒడిశా రైలు దుర్ఘ‌ట‌న‌పై వ‌ర్మ క‌న్ను ప‌డిందా

By:  Tupaki Desk   |   10 Jun 2023 12:01 PM GMT
ఒడిశా రైలు దుర్ఘ‌ట‌న‌పై వ‌ర్మ క‌న్ను ప‌డిందా
X
ఒడిశా రైలు దుర్ఘ‌ట‌పై అప్పుడే వ‌ర్మ క‌న్ను ప‌డిందా? సంచ‌ల‌నాల వ‌ర్మ భారీ ట్రైన్ యాక్సిడెంట్ పై కూపీ కి రెడీ అవుతున్నారా? త్వ‌ర‌లో యాక్సిడెంట్ స్పాట్ ని ప‌రిశీలించ‌డానికి వెళ్ల‌బోతున్నాడా? అంటే అవున‌నే లీకులందుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఒడిశా లోని బాలాసోర్‌ లో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. ఒకేసారి మూడు ట్రైన్లు ఒక‌దాన్నిఒక‌టి ఢీ కొట్ట‌డంతో భారీ ప్ర‌మాదం చోటు చేసుకుంది. వంద‌ల్లో మృత‌వాత ప‌డ్డారు. మ‌రెంతో మంది క్ష‌త‌గాత్రుల‌య్యారు.

ఈ ప్రమాదం ఎందరి జీవితాలనో శూన్యంలోకి నెట్టేసింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు కొందరైతే- పిల్లల్ని కోల్పోయిన పేరెంట్స్‌ మరికొందరు. ఇలా ఎంతో మంది జీవితాలను తలకిందులు చేసిందీ ప్రమాదం ఇది. యావత్ దేశాన్ని ఘ‌ట‌న క‌లిచి వేసింది.

ఊహించ‌ని పెను విప‌త్తుకి అంతా ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. రైళ్లు గుద్దుకోవ‌డ‌మా? అంటూ అంతా విస్తుపోయారు. ఇంకా ఆషాక్ నుంచి కోలుకోలేని ప‌రిస్థితి. ఆ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే రైలుకి సంబంధించిన చిన్న చిన్న ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం విస్మ‌యానికి గురి చేస్తుంది.

మ‌రి ఈ ఘ‌ట‌న‌ల‌పై వ‌ర్మ క‌న్ను ప‌డిందా? అంటే అవున‌నే తెలుస్తుంది. అప్పుడే ఈ దుర్ఘ‌టన‌పై వ‌ర్మ సినిమా తె ర‌కెక్కించే ప్లాన్ లో ఉన్న‌ట్లు లీకైంది. వ‌చ్చేవారంలో వ‌ర్మ యాక్సిడెంట్ స్పాట్ ని సంద‌ర్శించ నున్నారుట‌. అనంత‌రం క్ష‌త‌గాత్రుల్ని..చ‌నిపోయిన వారి కుటుంబ స‌భ్యుల్ని క‌లిసి వివ‌రాలు సేక‌రించే టీమ్ ని సైతం ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం. ఈ క‌థ‌ని పూర్తిగా వాస్త‌వాలు చూపిస్తూ వ‌ర్మ కోణంలో ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేసే అవ‌కాశం ఉంది. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌పై వ‌ర్మ శైలి ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు.

వాస్త‌వాల్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు ఆవిష్క‌రించ‌గ‌ల గ్రేట్ డైరెక్ట‌ర్. దేశంలో సంచ‌ల‌న సంఘ‌ట‌ల‌ను చోటు చేసుకున్న ప్ర‌తీసారి సినిమాగా వ‌ర్కౌట్ అవుతుందంటే? దాన్ని వెండి తెర‌కెక్కించి స‌క్సెస్ అందుకో వ‌డం ఆయ‌న స్టైల్. ఒరిస్సా దుర్ఘ‌ట‌న ఎంతో విచార‌క‌ర‌మైన‌ది.

ఎంతో ఎమోష‌న్ తో కూడుకున్న‌ది. అందుకే వ‌ర్మ కన్ను ప‌డింది. ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌ని రైల్వేశాఖ వివిధ కోణాల్లో చూస్తుంది. సీబీఐ తో ద‌ర్యాప్తు చేయించి నిగ్గు తేల్చాల‌ని కేసు బ‌దిలీ చేయ‌డం జ‌రిగింది. ఇప్ప‌టికే సీఐఐ వేట మొద‌లైంది.