హీరోయిన్ గా వాణీవిశ్వనాథ్ వారసురాలు!

Tue May 04 2021 09:00:02 GMT+0530 (IST)

Vanivishwanath heiress as heroine

తన అందంతో.. అంతకు మించిన అభినయంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు సీనియర్ హీరోయిన్ వాణీవిశ్వనాథ్. టాలీవుడ్ లో టాప్ స్టార్ గా వెలుగొందిన ఆమె.. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. అయితే.. ఇప్పుడు ఆమె నట వారసురాలు టాలీవుడ్లో అడుగు పెడుతోంది! ఆమే.. తన సోదరి కూతురు వర్ష విశ్వనాథ్.తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పటికే మూడు చిత్రాలు చేసిన ఈ అమ్మడు.. తెలుగులో లక్ ను టెస్ట్ చేసుకునేందుకు ట్రై చేస్తోంది. వర్ష విశ్వనాథ్ ఎంట్రీ ఇస్తున్న మూవీ ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’. శిరీషారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం.రమేష్ గోపీ సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్నారు. రమణ్ కథానాయకుడు.

అయితే.. తొలి సినిమా రిలీజ్ కాకముందే.. మరో రెండు చిత్రాలకు సైన్ చేసింది వర్ష. రెండో చిత్రంలోనూ రమణ్ తోనే నటించనున్నారట. మరో సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ సాలూరి సరసన నటించనున్నట్టు తెలుస్తోంది. మరి ఎంట్రీలోనే హ్యాట్రిక్ సినిమాలకు సైన్ చేసిన ఈ అమ్మడు.. పెద్దమ్మ పేరు నిలబెడుతుందేమో చూడాలి.