'వకీల్ సాబ్' మేకర్స్ ముందున్న అతి పెద్ద టాస్క్ అదే..!

Mon Jan 25 2021 13:20:33 GMT+0530 (IST)

Vakeel Saab is the biggest task ahead of the makers

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'వకీల్ సాబ్'. ఇది హిందీ 'పింక్' చిత్రానికి తెలుగు రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ లాయర్ గా నటిస్తున్న ఈ చిత్ర టీజర్ ని సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. అయితే ఈ టీజర్ గిమ్స్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్లుగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఎలాగైనా 'కేజీఎఫ్ 2' టీజర్ రికార్డులను బద్దలుకొట్టాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ గట్టిగా ట్రై చేసి ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు. ఇకపోతే ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాని 'వకీల్ సాబ్' టైటిల్ తోనే సోల్ మిస్సయేలా చేసారని.. కనీసం టీజర్ లో కూడా ఫిమేల్ లీడ్స్ ని ఫోకస్ చేయలేదనే కామెంట్స్ వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని దిల్ రాజు ఈ చిత్రానికి చాలానే ఖర్చు పెట్టేశాడు.'వకీల్ సాబ్' సినిమా బడ్జెట్ దాదాపు అన్ని కలిపి వంద కోట్ల మార్క్ టచ్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికి షూటింగ్ ముగించుకుని ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు  జరుపుకుంటోంది. అయితే ఇప్పుడు ఈ టీమ్ ముందున్న పెద్ద టాస్క్ పవన్ కళ్యాణ్ తో డబ్బింగ్ చెప్పించడమే. పవన్ ఉన్న బిజీకి అది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టమనే చెప్పాలి. అందుకే 'వకీల్ సాబ్' కి డబ్బింగ్ చెప్పించడానికి మేకర్స్ తలప్రాణం తోక్కి వస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఎలాగైనా ఈ సినిమాను ఏప్రిల్ 9న విడుదల చేయాలని దిల్ రాజు అండ్ టీమ్ ఆలోచిస్తోందట. ఏదేమైనా ఈలోగా పవర్ స్టార్ తో డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తి చేసుకుని 'వకీల్ సాబ్' ప్రజా కోర్టులో అడుగుపెడతాడేమో చూడాలి.