Begin typing your search above and press return to search.

వకీల్ సాబ్ వచ్చేస్తున్నాడు.. టార్గెట్ వారే!

By:  Tupaki Desk   |   14 Jan 2021 9:59 AM GMT
వకీల్ సాబ్ వచ్చేస్తున్నాడు.. టార్గెట్ వారే!
X
ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ మూవీ టీజర్ సంక్రాంతి కానుకగా ఇవాళ రిలీజ్ కాబోతోంది. భారీ అంచనాలతో రాబోతున్న టీజర్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ టీజర్ పవర్ ప్యాక్డ్ గా ఉంటుందని సమాచారం. పవన్ కమ్ బ్యాక్ టీజర్ తోనే రికార్డుల వేట మొదలు పెట్టాలనే సంకల్పంతో ఉన్నారు ఫ్యాన్స్. ఈ మేరకు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.

ఈ టీజర్ లో పవన్ మార్క్ ఎలివేషన్ ఉంటుందని తెలుస్తోంది. కేవలం 40 నుంచి 50 సెకండ్ల నిడివితో టీజర్ ఉంటుందని సమాచారం. ఇందులో పవన్ పంచ్ డైలాగ్ వింటే గూస్ బమ్స్ అవ్వాల్సిందేనని టాక్.

అయితే.. ‘అజ్ఞాతవాసి’ వంటి ఫ్లాప్ మూవీ తర్వాత వస్తున్న చిత్రం కావడం.. అది కూడా మూడేళ్ల గ్యాప్ తర్వాత రాబోతున్న మూవీ కావడంతో ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందేనని భావిస్తున్నారు ఫ్యాన్స్. అందుకే ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు.

కాగా.. ఈ టీజర్ కోసం ప్రత్యేకమైన ప్లాన్ సిద్ధం చేశారట అభిమానులు! ఇప్పటివరకు తెలుగు టీజర్లలో 24 గంటల్లో హయ్యస్ట్ వ్యూస్ సాధించిన టీజర్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ ఉంది. 14.65 మిలియన్ వ్యూస్ సాధించింది మహేష్ టీజర్. ఇక, అత్యధిక లైక్స్ పొందిన టీజర్ గా ‘ఆర్ఆర్ఆర్’ రామరాజు ఫర్ భీమ్ టీజర్ నిలిచింది. 9 లక్షల 40 వేల లైక్స్ సాధించిందీ టీజర్. ఇప్పుడు ఈ రెండు రికార్డులను ‘వకీల్ సాబ్’ టీజర్ ద్వారా బ్రేక్ చేయాలని పవన్ అభిమానులు పట్టుదలగా ఉన్నారు.

బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు బ్యానర్ పై రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అంజలి, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ లో సినిమా విడుదలకానుంది.