వకీల్ సాబ్ ట్రెండ్స్ కంటిన్యూ

Mon May 03 2021 09:00:46 GMT+0530 (IST)

Vakeel Saab Trends Continue

పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది.. వచ్చింది అంటే సోషల్ మీడియాలో సందడి వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వకీల్ సాబ్ విడుదలకు రెండు మూడు వారాల ముందు నుండే నెట్టింట సినిమాకు సంబంధించిన ట్రెండ్స్ మొదలు అయ్యాయి. యూట్యూబ్ ట్విట్టర్ ఇన్ స్టా ఇలా ప్రతి ఒక్క సోషల్ మీడియా వేదిక మీద వకీల్ సాబ్ ట్రెండ్స్ కొనసాగాయాయి. సినిమా విడుదల తర్వాత కూడా సినిమా గురించిన ప్రచారం నెట్టింట తెగ జరిగింది. పెద్ద ఎత్తున వకీల్ సాబ్ సినిమాకు వసూళ్లు నమోదు అవుతున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ మొదలై కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఒక్కసారిగా సినిమా కలెక్షన్స్ పడిపోయాయి. రెండవ వారంలో వకీల్ సాబ్ థియేటర్ల వైపు జనాలు కరోనా భయంతో చూడనే లేదు.కరోనా కారణంగా వకీల్ సాబ్ కు జనాలు రాకపోవడంతో మూడు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ ను మొదలు పెట్టారు. మూడు రోజుల క్రితం అమెజాన్ లో స్ట్రీమింగ్ మొదలైంది. స్ట్రీమింగ్ కు రెండు మూడు రోజుల ముందు నుండే వకీల్ సాబ్ అమెజాన్ లో అంటూ ట్రెండ్ నడిచింది. విడుదల తర్వాత కూడా సినిమా గురించి నెట్టింట అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అమెజాన్ లో చూస్తూ స్క్రీన్ షాట్ లను షేర్ చేస్తూ తమకు నచ్చిన సన్నివేశాన్ని మళ్లీ మళ్లీ చూస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వకీల్ సాబ్ సినిమా మళ్లీ నెట్టింట హంగామా చేస్తోంది.

అమెజాన్ లో ఈ సినిమా భారీ ఎత్తున రన్ టైమ్ ను దక్కించుకుంటున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే చూసినా కూడా మళ్లీ అమెజాన్ లో చూస్తున్నారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కొందరు సినిమాను థియేటర్లలో చూడలేక పోయారు. వారు అమెజాన్ లో చూస్తున్నారు. అలా వకీల్ సాబ్ అమెజాన్ లో భారీ గా వ్యూస్ ను దక్కించుకుంటుందట. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా కాస్త కమర్షియల్ టచ్ తో రూపొందిన వకీల్ సాబ్ లో పవన్ కు జోడీగా శృతి హాసన్ నటించగా కీలక పాత్రలో అంజలి.. నివేథ.. అనన్య లు నటించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం లో దిల్ రాజు ఈ సినిమా ను నిర్మించాడు.