ఈ సారి వైభవంగ వచ్చేస్తోందా?

Sat Jun 25 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

Vaishnav Tej Ranga Ranga Vaibhavanga movie teaser date

మహమ్మారి కరోనా కారణంగా గత రెండు మూడేళ్లుగా రిలీజ్ లు వాయిదా పడుతూ వస్తున్న సినిమాలు వన్ బై వన్ థియేటర్ బాట పడుతున్న విషయం తెలిసిందే. క్రేజీ మూవీస్ పాన్ ఇండియా మూవీస్ స్మాల్ మూవీస్.. మినిమమ్ బడ్జెట్ సినిమాలు ఇలా కేటగిరీల వారీగా సినిమాలు వరుసగా థియేటర్లకు క్యూ కట్టాయి. కరోనా తో పాటు అనేక కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన సినిమాలు కూడా ఎట్టకేలకు గత డిసెంబర్ నుంచి థియేటర్ల బాట పట్టాయి.అయితే కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా వున్నా వాయిదా పడుతూనే వున్నాయి. సరైన రిలీజ్ టైమ్ కోసం ఇప్పటికీ వేచి చూస్తూనే వున్నాయి.

ఈ నేపథ్యంలో యంగ్ హీరో మెగా మేనల్లుడి మూవీ కూడా వాయిదా పడుతూ వస్తోంది. `కొండ పొలం` తరువాత పంజా వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ `రంగ రంగ వైభవంగ`. కేతిక శర్మ హీరోయిన్. స్టార్ ప్రొడ్యూసర్ బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

`అర్జున్ రెడ్డి` తమిళ రీమేక్ `ఆదిత్యవర్మ`తో దర్శకుడిగా పరిచయమైన గిరీషాయ ఈ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఇద్దరు మెడికోల మధ్య సాగే రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల విడుదల చేసిన లిరికల్ వీడియోలు `తెలుసా.. తెలుసా.. `కొత్తగా లేదేంటీ.. టైటిల్ మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. ముందు ఈ మూవీని మే 27న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.

అయితే అనుకోకుండా భారీ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కావడంతో రిలీజ్ వాయిదా వేశారు. తాజాగా ఈ మూవీని జూలై 1న విడుదల చేస్తున్నారట.

దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ ని మళ్లీ స్పీడప్ చేసేశారు. ఇందులో భాగంగా ఈ మూవీ టీజర్ ని జూన్ 27న రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ శనవారం కొత్త పోస్టర్ తో ప్రకటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ఈ సారైనా ఖచ్చింతగా  పేరుకు తగ్గట్టే రంగ రంగ వైభవంగ థియేటర్లోకి వస్తుందేమో చూడాలి అంటున్నారు మెగా ఫ్యాన్స్.